Upasana konidela: రామ్ చరణ్ భార్య ఉపాసన తాజాగా మాతృత్వంపై తన ప్రశ్నలను సద్గురు ముందు ఉంచారు. RRR గురించి సద్గురుతో ఉపాసన అడిగింది. RRR అంటే సినిమా అయితే కాదు. మొదటి (R) రిలేషన్, రెండోవ (R) రీ ప్రొడ్యూస్, మూడవ (R) రోల్ ఇన్ లైఫ్, అంటూ వీటి గురించి జనాలు ఎందుకు అడుగుతుంటారు అని ఉపాసన సద్గురుని అడిగారు. దీనిపై సద్గురు అద్భుతంగా సమాధానం ఇచ్చారు.
నాకు, చరణ్ కి పెళ్లై పదేళ్లు అవుతున్నాయి. నా లైఫ్ నాకు ఎంతో నచ్చింది. ఐ లవ్ మై లైఫ్. ఐ లవ్ మై ఫ్యామ్లీ. కానీ జనాలు మాత్రం నా విషయంలో RRR గురించి అడుగుతుంటారు ఎందుకు?..రిలేషన్షిప్ (R), ఎబిలిటీ టు రీ ప్రొడ్యూస్ (R), రోల్ ఇన్ లైఫ్ (R) అంటూ జనాలు ఎప్పుడూ ఎందుకు నా గురించి ఆలోచిస్తుంటారు అని సద్గురుని అడిగేశారు.
అయితే ఈ ప్రశ్నలకి సద్గురు రీ ప్రొడ్యూస్ విషయంలో అద్భుతంగా సమాదనం చెప్పుకొచ్చారు. పిల్లల్ని కనకుండా ఉండేవారందరికీ నేను అవార్డులు ఇస్తాను. మనం పిల్లల్ని కనాల్సిన అవసరం లేదు. ఈ తరం వాళ్లు అలా ఉంటే నేను అందరికీ అవార్డు ఇస్తాను. ఒక వేళ నువ్వు ఆడపులివి అయి ఉంటే కచ్చితంగా పిల్లల్ని కనమని చెప్పేవాడిని. ఎందుకంటే అవి అంతరించి పోతోన్నాయి. కానీ మానవ జాతి అంతరించడం లేదు. ఇప్పటికే ఈ భూమ్మీద మనుషులు చాలా ఎక్కువ సంఖ్యలో పెరిగి పోతూన్నాం. పని ఉంటే పిల్లల్ని కనే ఆలోచనలు తక్కువ ఉంటాయి. పని లేని వాళ్లందరికి హార్మోన్లు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువలన పిల్లల్ని కంటూ ఉంటారు. కాబట్టి పిల్లన్ని కనకుండా ఉండటమే మనం ఈ సమాజానికి చేసే గొప్ప మేలు అన్నట్టుగా ఉపాసన అడిగిన ప్రశ్నలకు సద్గురు అద్భుతంగా సమాధానం చెప్పారు.
సద్గురు అలా సమాధానం చెప్పడంతో. రామ్ చరణ్ భార్య ఇలా అనేశారు. మీరు ఇలా చెప్పారు కదా? అయితే మీకు వెంటనే మా అమ్మ, అత్తగారి నుంచి ఫోన్లు వస్తాయ్ అని అన్నారు. అయితే దానికి సద్గురు అలాంటి అత్తలు, అమ్మల నుంచి నాకు ఎన్నో ఫోన్లు వస్తుంటాయ్ అని నవ్వేశారు.