Chiranjeeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ మూవీ టీజర్ గ్లింప్స్ అభిమానులను ఆకట్టుకోవడంతో మెగా అభిమానులు తెగ ఊగిపోతున్నారు. టీజర్ గ్లింప్స్‌లో చిరంజీవి అనే పేరులో ఒక అక్షరం యాడ్ అవ్వడంతో నెట్టింట తెగ చర్చలు జరుగుతోంది.
Megastar Chiranjeeevi:
చిరంజీవి ఈ పేరు మనకు కొత్తేమీ కాదు. అయిన ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పేరు వైరల్ అవుతోంది. తాజాగా చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ మూవీ టీజర్ గ్లింప్స్ రిలీజ్ అవ్వగా, అందులో చిరంజీవి పేరు ఇంగ్షీషులో చిన్న అక్షరం మార్పు కనిపించింది. ఆయన పేరు స్పెల్లింగ్ Chiranjeevi ఇలా ఇదివరకు ఉండేది. టీజర్ గ్లింప్స్ టైటిల్స్ లో ఒక ‘E’ని యాడ్ చేసి Megastar Chiranjeeevi అని స్క్రీన్‌పై వచ్చింది. దీంతో ఆయన పేరు మార్చుకున్నారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవికి వరుస ఫ్లాపుల నేపథ్యంలోనే చిరంజీవి పేరులో చిన్న మార్పు చేశారని తెలుస్తోంది. న్యూమరాలజిస్టుల సూచనల మేరకు మెగాస్టార్ తన పేరులో మూడో ‘E’ అక్షరాన్ని జతచేసినట్లు సమాచారం.
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తరువాత యంగ్ హీరోలకు పోటీగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఖైదీ 150 మూవీ సూపర్ హిట్‌గా మెగాస్టార్ కి నిలిచింది. మెగా ఫ్యాన్స్ రీఎంట్రీ సక్సెస్ ని సెలెబ్రేట్ చేసుకున్నారు. ఆ సినిమా తర్వాత స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ మూవీలో నటించారు. అయితే ఆ సినిమాకు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినా, కలెక్షన్ల పరంగా బాక్స్ ఆఫీసులో నిరాశే మిగిలింది. ఆచార్య సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ నటించగా.. ఈ చిత్రం ఇటీవల ప్రేకక్షుల ముందుకు రాగా, బాక్సాఫీసు వద్ద పెద్ద పరాజయాన్ని మరో సారి మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ పేరులో ఒక అక్షరం యాడ్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.
గాడ్ ఫాదర్:
తాజాగా రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ పోస్టర్లో మెగాస్టార్ లుక్ అభిమానులను ఆకట్టుకొని సోషల్ మీడియాలో వైరల్ అయింది. మెగాస్టార్ కుర్చీలో కూర్చున్న తీరు, రాజసం ఉట్టి పడుతోన్న విధానం పాత మెగాస్టార్ ని తలపించింది. ఇక గాడ్ ఫాదర్ టైటిల్ అనేది మెగాస్టార్ కి యాప్ట్ గా అదిరిపోయిందని ఇటు సినీ ప్రియులు అటు మెగా అభిమానులు అంటున్నారు. అదేవిధంగా టీజర్ గ్లింప్స్ కూడా అభిమానులకు తెగ నచ్చేసింది. ఈ టీజర్ గ్లింప్స్ వీడియోలో సునీల్ కారు డోర్ తీయగా, కారులో నుంచి చిరంజీవి బయటకు వచ్చే స్టైల్ పక్క మాస్. అప్పుడే స్క్రీన్ పై ‘Megastar Chiranjeeevi’ అని పేరు కనిపించింది. న్యూమరాలజిస్టు సలహా మేరకు ఒక అక్షరం జత చేసిన మెగాస్టార్ కి ఈ సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా వేచి చూద్దాం.