Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ ముచ్చటగా మూడోసారి జతకట్టబోతున్న ఈ సినిమా గురించి చాలా కాలం క్రితమే ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే.
తాజాగా ఈ ప్రాజెక్ట్‌కి ఉన్న చిన్న చిన్న అడ్డంకులు తొలగించి సెట్ పైకి తీసుకెళ్లేందుకు స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. త్రివిక్రమ్ ఇటీవల జర్మనీలో మహేష్‌కి పూర్తి స్క్రిప్ట్‌ను వివరించారట. మహేష్ బాబు కథలో కొన్ని మార్పులు సూచించారు. అన్ని మార్పులు చేసిన తర్వాత, త్రివిక్రమ్ స్క్రిప్ట్‌ని మళ్లీ వివరించారు. ఈ సారి మహేష్నుకి కథ నచ్చి ఒకే చెప్పారట. త్రివిక్రమ్‌ని షెడ్యూల్స్‌ని ప్లాన్ చేసి ముందుకు వెళ్లమని సూపర్ స్టార్ మహేష్ బాబు ఆదేశించగా. ఆగస్ట్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది, నెల మధ్యలో మహేష్ సెట్స్‌పైకి వెళ్లనున్నారు.
ఇప్పటికే నటీనటులు, సాంకేతిక నిపుణులను త్రివిక్రమ్ ఖరారు చేశారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చిత్రకరిస్తున్న ఈ చిత్రానికి పూజా హెగ్డే కథానాయిక నటిస్తుంది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప్రతిష్టాత్మక ఈ ప్రాజెక్టును నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ ఇద్దరూ భారీ రెమ్యూనరేషన్ తీసుకోనున్నారని టాలీవుడ్ సమాచారం. ఈ చిత్రాన్ని 2023 వేసవిలో విడుదల చేయాలని టీమ్ లక్ష్యంగా పెట్టుకుని సినిమా సెట్ పైకి వెళ్లనుంది. ఇంకా టైటిల్ పెట్టని ఈ ప్రాజెక్ట్‌కి నాన్-థియేట్రికల్ రైట్స్‌కి భారీ రేంజ్ లో బిజినెస్ జరిగిన వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతోంది.