RGV: ప్రస్తుతం టాలీవుడ్లో షూటింగ్ సంక్షోభం నెలకొంది. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్’, ‘తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి’ నిర్ణయాల మేరకు తెలుగు పరిశ్రమలో షూటింగ్‌లు నిలిచిపోయిన సంగతి అందరికి తెలిసిందే. ఈ షూటింగ్ సంక్షోభంపై పలు సినీ ప్రముఖులు రకరకాలుగా స్పందిస్తు తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.
ఈ పరిస్తితిలో షూటింగ్స్ బంద్‌పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ క్రమంలో తాజాగా ఓ ప్రముఖ తెలుగు చానల్‌తో మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ టాలీవుడ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి రావడానికి మన దర్శకుడు రాజమౌళి మొదటి కారణమంటూ తన షాకింగ్ కామెంట్స్ తెలిపారు. అయితే ఈ బంద్‌కు కారణం నటీనటుల హీరో పారితోషికం మరియు ఓటీటీలే ప్రధాన కారణమని మరోపక్క నిర్మాతలు చెబుతున్న విషయం కూడా కొంతవరకు నిజమే. కానీ ఓటీటీ వల్లే జనాలు థియేటర్లకు రావడం లేదన్న నిర్మాతల వాదనను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొట్టిపారేశాడు.
మన టాలీవుడ్‌కు అసలు శత్రవు దర్శకుడు రాజమౌళి, ఓటీటీలు కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు ఉన్న పరిస్తితిలో ప్రేక్షకులు షాట్ వీడియోలకు బాగా అలవాటు పడ్డారు. యూత్ ఎక్కువగా యూట్యూబ్‌ని ఫాలో అవుతున్నారు. ఓపిగ్గా థియేటర్లో రెండు గంటలు కూర్చొని సినిమా చూడాలంటే రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ లేదా కేజీయఫ్ లాంటి పెద్ద బడ్జెట్ సినిమాలకు జనాలు అలవాటు పడ్డారు, ప్రస్తుత పరిస్తితిలో ఇలాంటి పెద్ద సినిమాలకు మాత్రమే థియేటర్ లో ఆడే అవకాశం ఉందని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించాడు.