Pushpa: భారీ అంచనాలతో పుష్ప రేపు విడుదల కానుంది. ఈ నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం అభిమానులకు ప్రత్యేక ఐదో షో ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమాను అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. మరి అల్లు అర్జున్ మరి తొలి పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ థియేటర్లలోకి వచ్చేందుకు సిద్దంగా ఉంది. రేపు ఈ మూవీని గ్రాండ్గా విడుదల చేయబోతున్నారు పుష్ప యూనిట్. ఈ తరుణంలో స్పెషల్ షోస్, ప్రీమియర్ షోస్, కోసం అబిమనులు ఎగబడుతున్నారు. అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోసం కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అందించింది.
కామన్ గా ఒక రోజుకు నాలుగు షోస్ థియేటర్స్లో ఆడించడం ఆనవాయితీగా మనం చూస్తున్నాం. కొత్తగా వస్తున్నా పెద్ద హీరో సినిమాలు రిలీజ్ అయిన సందర్భాల్లో మాత్రం ప్రత్యేకంగా మరో షోకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. అయితే రేపు రిలీజ్ కాబోయే అల్లు అర్జున్ ‘పుష్ప’ విషయంలోనూ అదే అనుమతితో విడుదల కాబోతుంది. తెలంగాణ ప్రభుత్వం పుష్ప అభిమానులకు ప్రత్యేక ఐదో షో ప్రదర్శనకు అనుమతి ఇవ్వడం విశేషం. దీంతో ప్రేక్షకుల రద్దీని బట్టి శుక్రవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న థియేటర్లలో ‘పుష్ప’ ఐదు షోలు ప్రదర్శనకు అనుమతి ఇవ్వడం విశేషం.
‘పుష్ప ది రైస్’ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు డైరెక్టర్ సుకుమార్ తీసుకురానున్నారు. అందులో రేపు రిలీజ్ కానున్న మొదటి భాగమైన ‘పుష్ప ది రైజ్’. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ లో నిర్మించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్గా నటించగా. అనసూయ, సునీల్ కీలక పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిచారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్ అనుమతి ఇచ్చింది. ‘పుష్ప’ తెలుగుతో పాటు తమిళ, మళయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా రేపు పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కానుంది.