Pushpa Business: ఐదు భాషల్లో థియేట్రికల్, శాటిలైట్, డబ్బింగ్, డిజిటల్ అన్నీ హక్కుల ప్రీ రిలీజ్ బిజినెస్ సినిమాకు పెద్ద క్యూరియాసిటీని పెంచేశాయి.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతోన్న చిత్రం పుష్ప. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో డిసెంబర్ 17న విడుదలకు సిద్ధమైంది. ఆర్య, ఆర్య 2 తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించారు. అల్లు అర్జున్ డాన్సులకు పాన్ ఇండియా రేంజ్లో ఇండియా మొత్తం మంచి క్రేజ్ ఉంది. అల్లు అర్జున్ గత చిత్రం అల వైకుంఠపురం భారీ విజయాన్ని సాధించడంతో పుష్ప సినిమాపై పెద్ద రేంజ్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
సుకుమార్ డైరెక్ట్ కావడంతో సినిమాపై అంచనాలు పరిగాయి. సుకుమార్ గత సినిమాలు లాగా స్టోరీ టెల్లింగ్, మేకింగ్ లో మేజిక్ చేస్తాడని ప్రేక్షకులకు బాగా తెలుసు. అందుకే టాలీవుడ్ ఆడియెన్స్ సినీ లవర్స్ కూడా పుష్ఫ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్న, సునీల్, విలన్గా మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్లతో పాటు అనసూయ నటి నటులు జత కట్టడం ఒక ఎత్తు అయితే, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మరో ఎత్తు అవ్వడంతో పుష్ప సినిమాపై అతిగా ఎక్స్పెక్టేషన్స్ పెరగడానికి కారణం.
మరో వైపు మైత్రీ మూవీ మేకర్స్ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించడం కూడా సినిమాకు పెద్ద క్యూరియాసిటీని పెంచేశాయి. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.250 కోట్లకు పైగానే అయిందని సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం. ఇది ఐదు భాషల్లో థియేట్రికల్ హక్కులు, శాటిలైట్, డబ్బింగ్, డిజిటల్ అన్నీ హక్కులు కలిపి రూ.250 కోట్ల వ్యాపారం జరిగిందని సమాచారం.