హీరోయిన్ కాజల్ అగర్వాల్ అక్టోబర్ 30న వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్లో కాజల్ తన ప్రియుడిని పెళ్లాడారు.
పెళ్లి జరిగి వారం రోజులు తరవాత హనీమూన్ కోసం మాల్దీవులు వెళ్ళిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. కాజల్ హనీమూన్‌ను ఫొటోలను ఇప్పటికే సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది. సముద్రంలో 16 అడుగుల లోతున నిర్మించిన ‘ది మురక’ హోటల్లో కాజల్, గౌతమ్ స్టే చేశారు. ఇది ప్రపంచంలోనే తొలి అండర్ వాటర్ హోటల్.
ది మురక హోటల్లో ఒక్క రాత్రికి సుమారుగా 38 లక్షల రూపాయలు చెల్లించాలి. బాలీవుడ్ మీడియా రిపోర్ట్ ప్రకారం ఈ హోటల్లో కాజల్ అగర్వాల్ జంట 10 రోజులు స్టే చేసిందట. దీంతో హోటల్ అద్దె, ఆహారం, ఇతర సైట్‌సీయింగ్ ఖర్చులతో కలుపుకుని మొత్తం మీద కాజల్‌కు ఐదు కోట్లు అయితే, ఈ ఐదు కోట్లు హోటల్ బరించిందట .
బాలీవుడ్ నుంచి వస్తోన్న సమాచారం ప్రకారం. మాల్దీవులు పర్యాటక రంగాన్ని ఇతర దేశాల్లో ప్రమోట్ చేసేందుకు ముఖ్యంగా ఇండియాలో ప్రమోట్ చేసేందుకు ఆ దేశ ప్రభుత్వం డిజిటల్ మార్కెటింగ్ చస్తుంది. దీని కోసం ఇండియాలోని సెలబ్రిటీలను ఉపయోగించుకోవాలని ఆ ప్రభుత్వం నిర్ణయించిందని వార్తలు వస్తున్నాయి.
ఇన్‌స్టాగ్రామ్‌లో సెలబ్రిటీల ఫాలోవర్లు బట్టి ఉచిత సదుపాయాలు అందిస్తోందట. అయితే, ఈ ఉచితం సదుపాయం కోసం సెలబ్రిటీలు చేయాల్సిందల్లా ఇన్‌స్టాగ్రామ్‌లో తమ ఫొటోలు పోస్ట్ చేసి మాల్దీవులు పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేయడమే.
కాజల్ అగర్వాల్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 16 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా. ది మురక హోటల్ కాజల్ జంటకు ఉచితంగా రూమ్, ఫుడ్, ఫ్లైట్ టికెట్లు ఆఫర్ చేసిందట. దీంతో మాల్దీవులు వెళ్లిన కాజల్ ది మురక హోటల్‌కు ఇన్స్టాగ్రామ్ ద్వారా మంచి ప్రమోషన్ అందించారని బాలీవుడ్ నుంచి వస్తోన్న సమాచారం.