Pawan Kalyan: ప్రకాశం జిల్లాలో 3,000 మంది ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వడం లేదన్నారు నాదెండ్ల మనోహర్.
ఆదివారం నాడు బాపట్ల జిల్లా పర్చూరులో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. జనసేన పార్టీ బాపట్ల జిల్లా పర్చూరులో కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించనున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు జనసేన పవన్ కళ్యాణ్ లక్ష రూపాయిల చొప్పున ఆర్ధిక సాయం చేయనున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడు సంస్సరాల పరిపాలనలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 80 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని జనసేన పార్టీ ఆరోపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఆదివారం నాడు చిలకలూరిపేట, జాగర్లమూడి, యద్దనపూడి మీదుగా పవన్ కళ్యాణ్ పర్చూరుకు చేరుకుని బాధిత కుటుంబాలను జనసేనాని పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. ఎస్కే పీఆర్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు పవన్ కల్యాణ్ మాట్లాడతారు.
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ పవన్ కళ్యాణ్ పర్యటనపై నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ పాలనలో 3,000 మంది రైతులకు పైగా ఆత్మహత్య చేసుకున్నారని ఆయన ఆరోపించారు. అయితే, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వడం లేదన్నారు. ఆదివారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడ్డ 80 మంది కౌలు రైతుల కుటుంబాలకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం అందిస్తారని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.