Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Browsing: Entertainment
Entertainment
హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన ప్రియుడు గౌతమ్ తో కొత్త జీవితంలోకి ఆనందంగా అడుగు పెట్టింది. తాజాగా కాజల్ హానీమూన్ వెళుతున్నటు హింట్ ఇచ్చింది. లాక్ డౌన్ వల్ల అతి తక్కువ మంది అతిథులతో వీరి పెళ్లి ముంబైలో ఘనంగా జరిగింది. కాజల్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు భర్తతో కలిసి హనీమూన్ ఎంజాయ్ చేయడానికి సిద్దామవుతోంది ఈ విషయాన్ని కాజల్ అగర్వాల్ ఇన్స్టాగ్రామ్ లో బయలుదేరాటానికి సిద్దంగా ఉన్నాం అంటూ ఫోటో తో ఈ రోజు హింట్ ఇచ్చింది. అయితే ఏ ప్లేస్ కి వెళుతున్నది చెప్పలేదు. పెళ్లికి ముందు అసలు అతడితో కనీసం పరిచయం వున్నట్టు కూడా ఎక్కడా తెలియనివ్వలేదు. కానీ పీకల్లోతు ప్రేమలో వున్నామని, ఒకరిని విడిచి ఒకరం వుండలేమని పోస్టలు మీద పోస్ట్ పెట్టేస్తుంది. కాజల్ పెళ్లికి తరువాత అటు సంసారం, ఇటు సినిమా రెంటికీ ఇంపార్టంట్ ఇచ్చేలా ప్లాన్ చేసుకుంటోంది.…
చైతన్య జొన్నలగడ్డ, నిహారిక కొణిదెల పెళ్లి వివరాలు తెలిపిన ప్రభాకర్ రావు. గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు చైతన్య జొన్నలగడ్డ, మరియు మెగాడాటర్ నిహారిక కొణిదెల వివాహానికి ముహూర్తం పెద్దలు ఖరారు చేశారు. డిసెంబర్ 9, రాత్రి 7 గంటల 15 నిమిషాలకు వివాహానికి ముహూర్తం ఖరారైనట్లు ప్రభాకర్ రావు తెలిపారు. తిరుమల వేంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకుని, స్వామి పాదాల వద్ద వివాహ పత్రికను ఉంచి ఆశీర్వాదం తీసుకున్న ప్రభాకర్ రావు దంపతులు పెళ్లి ముహూర్తం గురించిన మీడియా వారికి వివరాలను తెలిపారు. అలాగే పెళ్లిని రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్‌లో చైతన్య, నిహారికల పెళ్లి జరగబోతున్నట్టు ప్రభాకర్ రావు తెలిపారు.
అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో చిత్రీకరిస్తున్న ‘పుష్ప’ మారేడుపల్లి అడవులలో త్వరలో షూటింగ్ ప్రారంభం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ‘పుష్ప’ తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇందుకోసం మారేడుమిల్లి ఆడవుల్లో షూటింగ్ కు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. Also Read: ఇటలీలో ప్రభాస్ ఫాన్స్ ఆసక్తిని చూస్తే షాక్ అవ్వాల్సిందే! ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథ కావడంతో ఈ చిత్రాన్ని ఎక్కువ శాతం అడవుల్లోనే చిత్రీకరించాల్సి ఉంది. అందువల్ల మారేడుమిల్లి అడవుల్లో నెల రోజుల పాటు కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను కూడా షూట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో అల్లు అర్జున్ పుష్పరాజ్ అనే యువకుడిగా పాత్రలో ప్రేక్షకులను అలరించేందుకు అల్లు అర్జున్ పాత్రగానే మారినట్టు మనకు తెలుస్తుంది. Also Read: కొత్త రికార్డు క్రియేట్ చేసిన ‘రాధేశ్యామ్’ మోషన్ పోస్టర్ పాన్ ఇండియా…
`రాధేశ్యామ్` టీం ప్రస్తుతం షూటింగ్ కోసం ఇటలీకి వెళ్లారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటలీలో ఉన్నారు. 1980 పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ కోసం ఇటలీలో ప్రత్యేక సెట్లను వేశారు. పీరియాడికల్ లవ్‌స్టోరీగా రూపొందుతున్న చిత్రం ఇది ప్రభాస్‌కు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న గుర్తింపు, అక్కడ స్థానికులు ప్రభాస్ ని చూసేందుకు చూపే ఆసక్తి ని బట్టి తెలుస్తుంది. `రాధేశ్యామ్` ఇటాలియన్లను కూడా ఆకర్షిస్తోంది తెలుస్తుంది. ఇప్పటికే అక్కడ కొన్ని మీడియా సంస్థలు `రాధేశ్యామ్` గురించి ప్రత్యేక కథనాలను ఇచ్చాయి. ప్రభాస్ ఇమేజ్ గురించి, `రాధేశ్యామ్` కాస్ట్యూమ్స్ డిజైనింగ్ గురించి ప్రత్యేక ఇంటర్వ్యూ లు చేశాయి. ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాయి. లాక్‌డౌన్ టైమ్ తర్వాత ఇటలీలో షూటింగ్ జరుగుతున్న తొలి సినిమా ప్రభాస్ `రాధేశ్యామ్ అవ్వడం విశేషం. ఇది కూడా వారి ఆసక్తికి ఒక కారణం.
రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు కానుకగా రాధేశ్యామ్ నుంచి ఓ స్పెషల్ ట్రీట్ అభిమనులకి ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. ప్రభాస్ సరసన బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే సంధర్బంగా రాధే శ్యామ్ మోషన్ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేశారు. ఈ మోషన్ పోస్టర్ రికార్డ్ క్రియేట్ చేస్తోంది. కేవలం నాలుగు రోజుల్లో 25 మిలియన్ ప్లస్ వ్యూస్ సాధించి. ఇండియన్ సినిమాలో అత్యధిక వ్యూస్ సాధించిన మోషన్ పోస్టర్‌గా రికార్డ్‌ను క్రియేట్ చేసినట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ జరుగుతున్నా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయడానికి చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం అటు అభిమానులు, ఇటు ప్రేక్షకులు మరియు…
నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తాజాగా మరో చారిత్రక పాత్రను పోషించపోతున్నారు. జానపద, పౌరాణిక, చారిత్రక పాత్రల నటనలో తనకు ఎవరు సాటిలేరనిపించుకున్న బాలయ్య ఇంతకు ముందు చాలా సినిమాలు చేసి అభిమానులను అలరించిన ఆయన చివరిగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’గా నటించి ప్రశంసలు అందుకొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా చారిత్రక వీరుడు గోన గన్నారెడ్డిగా ఆయన మన ముందు తెరపై కనిపించి అభిమానులను అలరించనున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన ప్రస్తుతం బీసీగా ఉన్నారు. ఆ చిత్రం అనంతరం ‘గోన గన్నారెడ్డి’ ప్రారంభమవుతుందని టాలీవుడ్ లో సమాచారం.
అల్లు అర్జున్‌తో ‘అలా వైకుంఠపురములో’ సినిమా తర్వాత త్రివిక్రమ్ తన తరువాత చిత్రం ఎన్టీఆర్‌తో ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కరోనా కారణంగా ప్లాన్ చేసిన షూటింగ్ షెడ్యూల్స్ అన్నీ మారిపోవడంతో, ఇంకా ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా షూటింగ్‌లోనే ఎన్టీఆర్ ఉన్నాడు. త్రివిక్రమ్‌తో సినిమా చేయడానికి చాలా టైమ్ పట్టేలా ఉండటంతో. త్రివిక్రమ్ రామ్ తో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం రెడ్ సినిమా పూర్తి చేసిన రామ్‌తో త్రివిక్రమ్ సినిమా చేసేందుకు అన్ని కార్యక్రమాలు రెడీ అయ్యాయని, అధికారికంగా సినిమాను ప్రకటించడమే తరువాయి అనేలా ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. ఈ న్యూస్ పై అఫిసియల్గా ఎటువంటి అప్డేట్ ఇప్పటి వరకు రాలేదు. రామ్ నటించిన ‘రెడ్’ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి థియేటర్స్‌లో విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది.
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో నిర్మాణ సంస్థ వచ్చేసింది. కృష్ణ స్థాపించిన పద్మాలయా స్టూడియోస్, మహేష్ బాబు స్థాపించిన జిఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్స్, సుధీర్ బాబు స్థాపించిన సుధీర్ బాబు ప్రొడక్షన్స్, రమేష్ బాబు స్థాపించిన కృష్ణా ప్రొడక్షన్స్ ప్రై లిమిటెడ్, మంజుల స్థాపించిన ఇందిర ప్రొడక్షన్స్ బ్యానర్లు కృష్ణ ఫ్యామిలీలో ఉన్నాయి. వీటిలో జిఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్స్, సుధీర్ బాబు ప్రొడక్షన్స్ మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా డాక్టర్ నరేష్, మరియు సూపర్ స్టార్ కృష్ణ మనవడు నవీన్ విజయ కృష్ణ కలిసి ‘విజయ కృష్ణ గ్రీన్ స్టూడియోస్ ప్రవేట్ లిమిటెడ్’ పేరుతో కొత్త సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల కలిసి 1972లో స్థాపించిన విజయ కృష్ణ మూవీస్ సంస్థనే ఇప్పుడు నరేష్, నవీన్ విజయ కృష్ణలు రీ లాంచ్ చేశారు. విజయ కృష్ణ మూవీస్ సంస్థలో ‘మీనా, హేమా హేమీలు,…
థియేటర్లు తెరుచుకోవడానికి ఈ నెలలో అనుమతులు ఇచ్చారు కానీ.చాలా తక్కువ సంఖ్యలో మల్టీప్లెక్స్ మాత్రమే రీఓపెన్ అయ్యాయి. అవి కూడా పేరుకి నడుస్తున్నాయి. థియేటర్ల సంగతి ఇలా ఉంటే సంక్రాంతి రేసు మాత్రం జోరుగా సాగుతన్నాయి. వరుసబెట్టి సంక్రాంతి రిలీజ్ అంటూ సినిమాలను ప్రకటించేస్తున్నారు. నితిన్ సినిమా ‘రంగ్ దె’ ను సంక్రాంతి రేసులో నిలబెడుతున్నట్లు టీజర్లో తెలుస్తుంది. ఇక రానా దగ్గుబాటి సినిమా ‘అరణ్య’ను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక దసరా సందర్భంగా రెండు సినిమాలు సంక్రాంతి విడుదలను ప్రకటించనున్నారు . అందులో ఒకటి రవితేజ సినిమా ‘క్రాక్’ కాగా.. మరొకటి రామ్ మూవీ ‘రెడ్’. ‘రెడ్’, ‘అరణ్య’ఎప్పుడో ఫస్ట్ కాపీతో రెడీ అయిపోయింది. ‘క్రాక్’, ‘రంగ్ దె’ షూటింగ్ చివరి దశలో ఉంది. ఒకే సారి నాలుగు సినిమాలంటే ఇక వేరే సినిమాలకు అవకాశం లేనట్లే. కారణం అప్పటిలోగా అన్నీ థియేటర్లు మామూలుగా నడుస్తాయా లేదా అన్నదే…
తమ అభిమాన హీరోలు వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తున్నందుకు సంతోషించాలో. అలా అనౌన్స్ చేస్తున్న సినిమాలు ఎగ్జైటింగ్‌గా లేవని బాధ పడలో తెలియని అయోమయంలో ఉన్నారు మెగా అభిమానులు. చిరంజీవి, పవన్ కల్యాణ్ కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ వరుసగా సినిమాలు చేస్తున్నారు. కానీ ఆ ఇద్దరూ రీమేక్ సినిమసలు చేయడం అభిమానులకు నచ్చలేదనే చెప్పాలి. మలయాళం హిట్ సినిమా ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్‌లో పవన్ కళ్యాణ్, రాణా నటించబోతున్నట్లు సమాచారం బయటికి వచ్చింది. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ సాగర్ చంద్ర దర్శకుడట. ఇది తెలుగులో కమర్షియల్‌గా వర్కవుటవదని, పవన్‌కు తగ్గ ఎలివేషన్ ఉన్న చిత్రం కాదని అంటున్నారు అభిమానులు. అసలు రీమేక్ అంటేనే ఎగ్జైట్మెంట్ ఏముంటుందన్నది వాళ్ల ప్రశ్న.’పింక్’ రీమేక్ ను ఎంచుకోవడం పట్ల కూడా పవన్ అభమనుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైయింది. ఐతే దాని తరువాత క్రిష్ , హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి ల సినిమాలతో అభిమానులు…