ఓటీటీలో సినిమాల రిలీజ్ అనేది చాలా కామన్ ట్రెండ్ అయిపోతుంది. చిన్న బడ్జెట్ సినిమాలతో పాటు పెద్ద సినిమాలు కూడా ఓటీటీవైపే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇతే కరోనా కారణంగా కొన్ని సినిమాల పరిస్థితి అయోమయంగా మారింది. ఇక మరికొన్ని సినిమాలు కనీసం ఓటీటీలోనైనా రిలీజ్ అవ్వాలని రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో త్వరలో నాగార్జున నటించిన యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న వైల్డ్ డాగ్ సినిమా కూడా డైరెక్ట్ గా ఓటీటీలోకి రాబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.
ఈ ఏడాది సమ్మర్ ఎండింగ్ లోనే వైల్డ్ డాగ్ సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా వల్ల తుది షెడ్యూల్ వాయిదా వేయాల్సి వచ్చింది. దాదాపు 7 నెలల తరువాత షూటింగ్ ని స్టార్ట్ చేసి సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా త్వరలోనే ఫినిష్ కానున్నాయి.
వైల్డ్ డాగ్ సినిమా ఓటీటీ హక్కుల కోసం కొన్ని సంస్థలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. హాట్ స్టార్, అమెజాన్ తో పాటు నెట్ ఫ్లిక్స్ సంస్థలు డీల్ కోసం భారీ అమౌంట్ ని ఆఫర్ చేసినట్లుగా టాక్ అయితే వస్తోంది. అయితే నెట్ ఫ్లిక్స్ సినిమాపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు టాలీవుడ్ సమాచారం.