బిగ్‌బాస్‌లో తెలంగాణ వారికి అన్యాయం జరిగిందని రవి అభిమానులు ఆందోళన వ్యక్తపరిచారు. ఈ వారం బిగ్‌బాస్ సీజన్ 5లో యాంకర్ రవి ఎలిమినేట్ అయిన విషయం మనకు తెలిసిందే.
అయితే రవి ఎలిమినేషన్ ప్రక్రియ పారదర్శకంగా జరగలేదని, ఆదివారం రాత్రి ఎలిమినేట్ అయిన రవి కోసం తన అభిమానులు ఒక్కసారిగా అన్నపూర్ణ స్టూడియోస్ ముందు చేరుకుని ఆందోళన నిర్వహించారు. రవి స్ట్రాంగ్ కంటెస్టంట్ అని, అతను ఎలిమినేట్ అవుతాడని తాము ఊహించలేదన్నారు.
పోయిన వారంలో నామినేషన్స్‌లో సన్నీ, రవి, శ్రీరామ్, షణ్ముఖ్, ప్రియాంక, కాజల్, సిరి ఉన్నారు. వీరిలో శ్రీరామ్, సిరి, సన్నీ శనివారం ఎపిసోడ్‌లోనే సేవ్ అయ్యారు. తరువాత రోజు ఆదివారం ఎపిసోడ్లో యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యారు. దీంతో రవి అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. కాజల్ లేదా ప్రియాంక ఎలిమినేట్ అవ్వాలి కానీ, రవి ఎలిమినేట్ అవడం ఏంటి అని, బిగ్‌బాస్‌లో తెలంగాణ వారికి అన్యాయం జరిగిందని రవి అభిమానులు ప్రశ్నిస్తున్నారు.