తమ అభిమాన హీరోలు వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తున్నందుకు సంతోషించాలో. అలా అనౌన్స్ చేస్తున్న సినిమాలు ఎగ్జైటింగ్‌గా లేవని బాధ పడలో తెలియని అయోమయంలో ఉన్నారు మెగా అభిమానులు.
చిరంజీవి, పవన్ కల్యాణ్ కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ వరుసగా సినిమాలు చేస్తున్నారు. కానీ ఆ ఇద్దరూ రీమేక్ సినిమసలు చేయడం అభిమానులకు నచ్చలేదనే చెప్పాలి. మలయాళం హిట్ సినిమా ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్‌లో పవన్ కళ్యాణ్, రాణా నటించబోతున్నట్లు సమాచారం బయటికి వచ్చింది. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ సాగర్ చంద్ర దర్శకుడట.
ఇది తెలుగులో కమర్షియల్‌గా వర్కవుటవదని, పవన్‌కు తగ్గ ఎలివేషన్ ఉన్న చిత్రం కాదని అంటున్నారు అభిమానులు. అసలు రీమేక్ అంటేనే ఎగ్జైట్మెంట్ ఏముంటుందన్నది వాళ్ల ప్రశ్న.’పింక్’ రీమేక్ ను ఎంచుకోవడం పట్ల కూడా పవన్ అభమనుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైయింది. ఐతే దాని తరువాత క్రిష్ , హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి ల సినిమాలతో అభిమానులు సంతోసించారు. కానీ ఇంతలో ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ రావడంతో సోషల్ మీడియాలో తమ వ్యతిరేకతను చూపించేస్తున్నారు.
అలాగే మరోవైపు చిరంజీవి కూడా ఆచార్య, తరువాత లూసిఫర్, వేదళం, లాంటి రొటీన్ మాస్ మసాలా సినిమాలు రీమేక్ లు కూడా మెగా అభిమానులకు నచ్చలేదు. మెగా బ్రదర్స్ కు విషయం తెలిసేలా చేయాలని అభిమానులు సోషల్ మీడియాలో తమ వ్యతిరేకతను చూపిస్తున్నారు.