ప్రభాస్ వరుసగా నటిస్తున్న నాలుగు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. అందులో రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమా ‘రాధేశ్యామ్’. అలాగే, మరో భారీ చిత్రం ‘ఆదిపురుష్’ షూటింగ్ కూడా పూర్తి అయింది.
ప్రస్తుతం ప్రభాస్ షూటింగ్ చెయ్యాల్సిన చిత్రాలు రెండే. ఒకటి ‘సలార్’, మరోటి ప్రాజెక్ట్ K. సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టేశారు. సలార్ తరువాత ప్రభాస్ ఫోకస్ అంతా ‘ప్రాజెక్ట్ K’పైనే. 300 వందల కోట్ల రూపాయలతో భారీగా తీస్తున్న ఈ సినిమాకి ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ కావడంతో ప్రభాస్ దాదాపు 200 రోజుల కాల్షీట్లు ఇస్తున్నారట.
‘ప్రాజెక్ట్ K’ సినిమా కోసం వన్ ఇయర్ టైం కేటాయించాలని నాగ అశ్విన్ ప్రభాస్ ని కోరాడట. కానీ, ఒకే సినిమా కోసం అంతా మొత్తం టైం ఇవ్వలేను అని ప్రభాస్ చెప్పారు. కనీసం 200 రోజులు డేట్స్ ఇవ్వండి అని నాగ అశ్విన్ అడిగితే ఓకే చెప్పారట.
‘సలార్’ షూటింగ్ తో పాటు ‘ప్రాజెక్ట్ కే’ సినిమా కూడా ఓకే సమయంలో చేస్తారు ప్రభాస్. కానీ ఎక్కువ రోజులు నాగ్ అశ్విన్ కి ఇవ్వాలని నిర్ణయించారట. ఈ సినిమాలో ముఖ్య పత్రాలు అమితాబ్ బచ్చన్, దీపిక పదుకోన్ నటిస్తున్నారు. అమితాబ్ సంబంధించిన సన్నివేశాలు ఇది వరకే పూర్తి చేసేశారు.