షారుక్ ఖాన్ ‘జీరో’ 2018 సినిమా ఫ్లాఫ్ అయిన తరువాత మరో ప్రాజెక్ట్ చేయలేదు. సుమారు రెండేళ్ల తరువాత “పఠాన్” అనే సినిమా చేస్తున్నాడు. డైరెక్టర్ సిద్దార్ధ్ ఆనంద్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ చిత్రం యూనిట్ త్వరలో షూటింగ్ వెళ్లనుంది. దీని తరువాత రాజ్ కుమార్ హిరణీ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు షారుక్ ఖాన్. మూడో ప్రాజెక్టు తమిళ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వంలో కమిట్ అయ్యారు షారుక్. ‘రాజా రాణి’ ‘పోలీసోడు’ ‘అదిరింది’ ‘విజిల్’ వరుస హిట్లు ఇచ్చిన అట్లీ ఇప్పుడు షారుక్ ఖాన్ కోసం ఓ పవర్ పుల్ కథను తయారు చేశారని సమాచారం. ఫుల్ స్క్రిప్ట్ తో రెడీగా ఉన్న అట్లీ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం షారుక్ ఖాన్ తో చేయించనున్నారట. అది కూడా తండ్రి కొడుకులని తెలుస్తుంది. తండ్రి (RAW) రా ఏజెంట్ గా, కొడుకు గ్యాంగ్ స్టర్ గా కానిపిస్తారట. షారుక్ ఖాన్ కు డ్యూయల్ రోల్ చేయడం కొత్తమీ కాదు.
‘డూప్లికేట్” డాన్’ ‘ఫ్యాన్’ వంటి సినిమాలో షారుక్ ఖాన్ డ్యూయల్ రోల్ చేసి అభిమానులను మెప్పించారు. ఇప్పుడు మరోసారి డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.