అల్లు అర్జును, సుకుమార్ కాంబినేషన్ లో నడుస్తున్న చిత్రం పుష్ప. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా షూట్ ఈస్ట్ గోదావరి జిల్లా మారేడుమిల్లిలో జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.
కానీ అర్థాంతరంగా షూటింగ్ క్యాన్సిల్ అయి యూనిట్ వెనక్కు తిరిగారు. ఏదో సమస్యతో యూనిట్ మెంబర్ ప్రాణాలమీదకు వచ్చినట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. దీంతో ఉన్నట్టుండి షూటింగ్ క్యాన్సిల్ చేసి యూనిట్ అంతా మారేడుమిల్లి నుంచి వెనక్కు రావాల్సినట్టు తెలుస్తోంది.
కరోనా నేపథ్యంలో తక్కువ మందింతో షూటింగ్ చేయాల్సిన అవసరం వుంది. అయితే మారేడుమిల్లి ప్రాంతంలో దాదాపు తొమ్మిది వందల మందితో రోజుకు నలభై లక్షలు ఖర్చుతో అతి భారీగా షూటింగ్ జరుగుతుందట.
పైగా ఇక్కడ ఓ షెడ్యూలు చేద్దాం అనుకున్న సుకుమార్, ఇక్కడ డీప్ ఫారెస్ట్ లుక్ చూసి, మరో షెడ్యూలు కూడా ఇక్కడే చేయాలని అనుకొన్న టైమ్ లో కరోనా కారణంగా ఇలా క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది.