సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో రాబోతోన్న పుష్ఫ సినిమాకు ఉన్న క్రేజ్ తగ్గట్టు రూమర్లు కూడా చుట్టుకున్నాయో అందరికీ తెలిసిందే. హిందీ డబ్బింగ్ సినిమాను ఎవ్వరూ కొనడం లేదు.. శాటిలైట్, యూట్యూబ్‌లోనే పుష్ప రిలీజ్ కానుందని వార్తలు వచ్చాయి. రూమర్లకు తగ్గట్టే పుష్ప యూనిట్ కూడా మధ్యలో హిందీ పోస్టర్లను మరియు పాటలు కూడా రిలీజ్ చేయలేదు. అయితే తాజా సమాచరం హిందీ హక్కులు అమ్ముడుపోయాయట.
తాజాగా మైత్రి మూవీ మేకర్స్ ప్రకటన చేసింది. కేజీయఫ్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన AA Films India అనే సంస్థ పుష్ప హిందీ హక్కులను సొంతం చేసిందట. అయితే పుష్ప పాన్ ఇండియన్ లెవెల్లో చేరేందుకు ఇంకా ఎలాంటి అడ్డంకులు లేదు. అలాగే కర్ణాటక హక్కులను స్వాగత్ అనే సంస్థ సొంతం చేసుకొందట.
ఆల్రెడీ తమిళ, మళయాల హక్కులు అమ్ముడుపోయాయి. దీంతో పుష్ప బిజినెస్ పాన్ ఇండియా లెవెల్లో పూర్తయింది. అయితే షూటింగ్ మాత్రం ఇంకా జరుగుతూనే ఉంది. మరి అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ అవుతుందా? అన్నది కూడా అనుమానంగానే మారింది. సాంగ్ షూటింగ్ మరియు డబ్బింగ్ పనులు మిగిలే ఉన్నాయి. కానీ ప్రమోషనల్ కార్యక్రమాలు మంచి ఊపులో ఉన్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ కొట్టిన అన్నీ పాటలు ఇప్పటికే వైరల్ అవుతుంది. తాజాగా రిలీజ్ అయిన నాలుగో పాట ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా ప్రస్తుతం దుమ్ములేపేస్తోంది.