‘అర్జున్ రెడ్డి’రీమేక్ ‘కబీర్ సింగ్’తో సూపర్ హిట్ కొట్టిన షాహిద్ కపూర్ తన తదుపరి సినిమాకు నలభై కోట్ల రూపాయల పారితోషకాన్ని అడుగుతున్నాడట. ఐనా నిర్మాతలు ఓకే చెబుతూ ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.
‘కబీర్ సింగ్’ సినిమా ఏకంగా మూడువందల యాభైకోట్ల రూపాయల పైస్థాయి వసూళ్లు సాధించింది. ఈ సినిమా యాభై కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందించబడింది. ఆ సినిమా హిట్ కావడంతో ఇప్పుడు తన పారితోషకాన్ని భారీగా పెంచాడట సాహిద్. ఇలా అర్జున్ రెడ్డి రీమేక్ షాహిద్ రేంజ్ ను భారీగా పెంచేసింది! తెలుగులో హిట్టైన ‘జెర్సీ’ సినిమా హిందీలో రీమేక్ కాబోతోంది. దాంట్లో కూడా షాహిద్ కపూర్ హీరోగా నటించబోతున్నాడు. కరణ్ జొహార్ ఆ సినిమాను నిర్మించబోతున్నాడు. హీరోగా నటిస్తున్నందుకు గానూ షాహిద్ కు నలభై కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ఓకే చెప్పాడట కరణ్ జొహార్.