టాలీవుడ్లో ఈ మధ్య కాలంలో కమర్షియల్ సినిమాలకన్నా అడల్ట్ కంటెంట్ ఓరియెంట్‌డ్ సినిమాలు ఎక్కువయ్యాయి. అలాంటి కంటెంట్‌తోనే పోస్టర్లు, ప్రోమోలతో ప్రేక్షకులకు హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ సినిమా ఆ కేటగిరికి చెందుతుందో లేదో తెలీదు కానీ ప్రస్తుతం పోస్టర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘దొరకునా ఇటువంటి సేవ’ టైటిల్‌తో పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు. ఈ పోస్టర్లో నటీనటులు ఎవరూ లేరు. ‘దొరకునా ఇటువంటి సేవ’ అని టైటిల్ ఉంది. టైటిల్ పైన ‘DIS’ అని షార్ట్ కట్ ఫాంను డిజైన్ చేశారు. ‘I’ అక్షరంపై అమ్మాయి సెక్సీగా నిలబడిన షాడో ఉంది. వీటి అన్నిటినీ మించిన విషయం ఈ పోస్టర్ లో ఉంది. ముగ్గురు అబ్బాయిల చూపుడు వేలను ఒక అమ్మాయి తన గుప్పిటలో పట్టుకొని ఉండటంతో ఇక్కడే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
దేవి ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై దేవ్ మహేశ్వరం నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రామచంద్ర రాగిపిండి దర్శకత్వం వహించారు. ‘‘సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం డీటీఎస్ మిక్సింగ్ ఫైనల్ దశలో ఉంది. జనవరిలో సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నాం.