ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ కొత్త సినిమా ప్రకటించాడు. కానీ ఈ ప్రాజెక్టు ఒకటి ఉందని చాన్నాళ్లుగా టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. అయితే హోంబలే ఫిలిమ్స్ సంస్థ ఈరోజు అధికారికంగా ఒక ప్రకటన ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచే సెట్స్ పైకి వెళ్లబోతుందన్న విషయాన్ని ప్రకటించింది.
జనవరి నుంచి సలార్ సినిమా షూటింగ్ ప్రారంభమౌతుందన్న విషయాన్ని ప్రభాస్ కూడా అదికారికంగా ప్రకటించాడు. ఇప్పటికే ప్రభాస్ 2 పెద్ద ప్రాజెక్టులు ఎనౌన్స్ చేశాడు. అవి సెట్స్ పైకి వస్తాయని ఎదురుచూస్తున్న సమయంలో ఈ సినిమాను ప్రకటించి అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు.
ఆదిపురుష్ ముందుగా సెట్స్ పైకి వస్తుందని అనుకొంటే.. నాగ్ అశ్విన్ సినిమానే ముందుగా వస్తుందని మరో వైపు టాలీవుడ్ ప్రచారం. కొందరైతే రెండు సినిమాలు సైమల్టేనియస్ గా ప్రభాస్ షూటింగ్ చేస్తాడు అన్నారు.
కానీ తాజాగా ప్రకటన ప్రకారం సలార్ సినిమానే ముందుగా సెట్స్ పైకి రాబోతోందనే విషయం తేలింది. అయితే రాధేశ్యామ్ తర్వాత తమ సలార్ మూవీనే థియేటర్లలోకి వస్తుందని స్వయంగా హోంబలే ఫిలిమ్స్ నిర్మాతల్లో ఒకరైన విజయ్ కిరగందూర్ ప్రకటించడం విశేషం.
ఈ ప్రకటనతో రాధేశ్యామ్ తర్వాత ప్రభాస్ నుంచి వచ్చే సినిమాపై అటు అభిమానులకు ఇటు ఇండస్ట్రీకి క్లారిటీ వచ్చినట్టే.