కరోనా ప్రభావం వల్ల తీవ్రంగా నష్టపోయిన సినీ రంగం, ఎనిమిది నెలల పాటు సినీ పరిశ్రమ మూతబడటంతో తీవ్ర ఆర్థిక నష్టం జరిగింది.
ఓవైపు షూటింగ్‌లు ఆగిపోవడం, మరోవైపు థియేటర్లు మూతబడటంతో ఎంతో మంది కార్మికులు జీవన ఉపాధిని కోల్పోయారు. సినీ పరిశ్రమను మెరుగు పరిచేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు. ఇదివరకే తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిగి, సీఎం కేసీఆర్ సైతం ఇటీవల ఫిల్మ్ ఇండస్ట్రీని ఆదుకోవడం జరిగింది.
మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్. సినిమా థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతులు ఇస్తూ, సినిమా టిక్కెట్లను సవరించుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. అయితే, ప్రభుత్వం పెట్టిన నిబంధనలు థియేటర్లు యాజమాన్యాలకు అనుకూలంగా లేకపోవడంతో. ఇప్పటి వరకు తెలంగాణలో ఏ థియేటర్ తెరుచుకోలేదు.
ఏఎంబీ సినిమాస్ ఒకడుగు ముందుకేసి సినిమా ప్రదర్శన డిసెంబర్ 4న మొదలుపెడుతోంది. మంగళవారం నుంచి టిక్కెట్ బుకింగ్ కూడా ప్రారంభంకానుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ ఒక వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు. ఈ ప్రకటనతో ఇటు సినీ ప్రేమికులలో ఉచ్చాహం, అటు సినీ ప్రముఖులు కూడా పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.