Liger: ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం లైగర్. పూరీ జగన్నాథ్ దర్శకత్వం నుంచి వస్తున్న తొలి పాన్ ఇండియన్ సినిమా ఇదే.
తాజాగా ఇటీవల వచ్చిన పోస్టర్స్ మరియు టీజర్, సినిమాకు కావల్సినంత పబ్లిసిటీతో పాటు క్రేజ్ ను తెచ్చాయి. ఈ చిత్రం హిందీ వెర్షన్ కు సంబంధించిన డీల్ చాలా ముందుగానే నిర్మాతల్లో ఒకరైన కరుణ్ జోహార్ ఈ చిత్రాన్ని ఓన్ గా రిలీజ్ చేస్తున్నాడు. ఇటీవలే తెలుగు డీల్ ను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను క్లోజ్ చేసి రేటు ఫిక్స్ చేశారని ఇప్పుడు వార్తలు వైరల్ అవుతుంది.
సౌత్ ఇండియాలోని అన్ని ఏరియాల్లోని మరియు భాషల హక్కులను 70 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారని వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు పూరీ జగన్నాథ్ రికవరీ అడ్వాన్స్‌గా ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను నుంచి రూ.10 కోట్లు అడుగుతున్నట్లు వార్తలు కూడా జోరుగా వినిపిస్తోంది. అంతేకాకుండా, డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను ఆంధ్ర ప్రాంతాన్ని 30 కోట్ల రూపాయలకు మొత్తం ఆంధ్రాకి విక్రయించాలనే ఆలోచన ఉనట్టు వార్తలు వస్తున్నాయి.
వైజాగ్ ఏరియాను కొరటాల స్నేహితుడు సుధాకర్ 7.5 కోట్లకు తీసుకున్నాడు. తూర్పుగోదావరి హక్కులను భరత్ చౌదరి చేజిక్కించుకోగా మిగిలిన ఏరియాలు చర్చల్లో ఉన్నాయని తెలుస్తుంది. మొత్తానికి విజయ్ దేవరకొండ స్టార్ హీరోల రేంజ్ లో తన లైగర్ బిజినెస్ తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాడు.