Mahesh Babu: మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఎవరు ఎదురు చూడని ట్విస్ట్ పడింది. రాజమౌళిని ప్రక్కన పెట్టి మహేష్ బాబు వేరే సినిమాలో ముందుకు వెళ్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా బాహుబలి” సినిమా తో సరికొత్త రికార్డులు సృష్టించిన ఎస్ఎస్ రాజమౌళి. ఈ మద్యలో విడుదలైన రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా “ఆర్ ఆర్ ఆర్” సినిమాతో రాజమౌళి రికార్డులను తిరగరాశారు. తెలుగు తెరపై తిరిగులేని మహేష్ బాబు. సర్కారు వారి పాట తన స్టార్ డమ్ తో దుమ్ము రేపారు. అయితే వీళ్లిద్దరు కాంబినేషన్ అంటే మామూలుగా ఉండదనేది అందరి ఆలోచన. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది.
రాజమౌళితో సినిమా అంటే మామూలు విషయం కాదు, చాలా సంవత్సరాలు అవుతుంది. సినిమా ఫైనల్ కాపీ వచ్చేదాకా హీరో ఆయనకు అందుబాటులో ఉండాలి. మహేష్ బాబు ఈ లోగా తనకు గ్యాప్ రాకుండా చూసూకోవాలని భావిస్తున్నారు. అయితే నిజానికి ఈ సినిమా కేవలం వచ్చే సంవత్సరం చివరకు సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు లేదన్నట్టు తెలుస్తోంది. రాజమౌళికి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కోసం ఇంకా చాలానే సమయం కావాలి. అందుకే సినిమా ఆలస్యం అవుతోంది అన్న విషయం తెలుస్తుంది.
ఈ లోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఒక సినిమా ప్లానింగ్ లో ఉంది. ఈ సినిమా ఆగస్టులో షూటింగ్ ప్రారంభం కానుందని చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ బీసీగా జరుగుతోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయనున్నట్లు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పేర్కొంది.
తాజాగా మహేష్ బాబు రాజమౌళికి ఒక రిక్వెస్ట్ చేశారట. ఈ సినిమా షూటింగ్ చేస్తూనే మరో సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసేలాగా ఉండాలని, సినిమాలో తన పాత్ర కి ఎటువంటి స్పెషల్ లుక్ ఇవ్వద్దని కోరారట. అంతేకాకుండా బిజీగా ఉండే నటినటులు వద్దు కొంచెం ఫ్రీగా ఉండే నటులను ఎంపిక చేయమన్నారట. అయితే మరోవైపు అభిమానులు మాత్రం సర్కారు వారి పాట వంటి నాలుగు సినిమాలు చేయడం కంటే, మూడు నాలుగేళ్లు పట్టినా సరే రాజమౌళి దర్శకత్వంలో ఒక్క సినిమా చేయడం మంచిదని భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ సీనియర్ నిర్మాత డా.కె ఎల్ నారాయణ , శ్రీ దుర్గ ఆర్ట్స్ పతాకంపై భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.