Pushpa: చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో, సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తోన్న చిత్రం ‘పుష్ప. ఈ చిత్రం డిసెంబర్ 17న సినిమా విడుదలకు సిద్దమౌతుంది.
అల్లు అర్జున్ నటించిన తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో భారీ అంచనాలతో ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో సినిమాకు కొత్త ప్రాబ్లెం ఎదురవుతున్నాయి. సాధారణంగా సినిమాలకు స్టోరీ మీద, లేదా ఫైనాన్సియల్ ప్రాబ్లం చూస్తుంటాం. ఇప్పుడు ఈ సినిమా వచ్చిన కొత్త ప్రోబ్లం కంటెంట్ మీద. ఆ పదం వాడారని, ఫలానా కంటెంట్ వల్ల మా మనో భావాలు దెబ్బ తిన్నాయంటూ కేసులు ఫైల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై రెండు కేసులు ఫైల్ అయ్యాయి. అందులో ఒకటి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీసులు స్టేషన్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించింది ఫైల్ అవ్వగా. మరో కేసును ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పురుష సంఘానికి చెందిన ప్రతినిధులు కేసు ఫైల్ చేసినటట్లు సమాచారం.
పుష్ప సినిమాకి, పురుషుల సంఘానికి సంబంధం ఏంటి? అనే ఆలోచన కచ్చితంగా అందరిలో వస్తుంది. అయితే ఈ సినిమాలో రీసెంట్గా రిలీజ్ అయిన ఊ అంటావా మావ ఉ ఉ అంటావా మావ అనే ఐటెమ్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాట పెద్ద వైరల్ అవుతుంది. అయితే ఈ పాటలోని అర్ధం మగవాళ్లందరూ కామంతో ఉంటారనే భావనలో ఉందని వ్యక్తం చేయడమే కాకుండా, ఆ పాటను సినిమాలోంచి తీసేయాలని పురుష సంఘం ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ కోర్టును ఆశ్రయించింది. ఈ పాటను దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో చంద్రబో రాశారు.
ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇది వరకు అల్లు అర్జున్ చేయని మాస్ పాత్ర లారీ డ్రైవర్ పుష్పరాజ్. శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న నటించారు. ఈ చిత్రంలో సమంత ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్ చేశారు. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, అజయ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.