Pushpa Part-2: పుష్ప రెండో భాగం విషయంలో అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్‌కి పెద్ద కండీషన్ పెట్టారట. మరోసారి కథలో సీన్స్ చెక్ చేసుకుని పక్కా ప్లాన్ తో సినిమా షూటింగ్ వెల్లాలి.
అల్లు అర్జున్ మరియు సుకుమార్ మధ్య మంచి స్నేహం నడుస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేసిన ఆర్య ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిన విషయం. ఈ సినిమాతోనే ఆర్యతోనే సుకుమార్ తన డైరెక్టర్‌గా జర్నీని మొదలు పెట్టారు. ఆ సినిమా నుంచి ఇద్దరూ మంచి స్నేహితులుగా కంటిన్యూ చేస్తున్నారు. వీరిద్దిరి కాంబినేషన్లో ఆర్య తరువాత ఆర్య 2 సినిమాల హిట్ తర్వాత తాజాగా ‘పుష్ప’ సినిమా విడుదలైన రన్నింగ్ లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. పుష్ప రిపోర్ట్ మొదట అటు ఇటు ఉన్నా తరువాత పికప్ అయింది. పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తూ రికార్డులు క్రియేట్ చేస్తుంది. పుష్ప సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు.
మొదటి భాగంగా ‘పుష్ప’ రీసెంట్ గా రిలీజ్ అయింది. రెండో భాగం పుష్ప ది రూల్ షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్ మీదకు వెళ్లనుందని సినిమా యూనిట్ వారు తెలిపారు. కానీ ఇక్కడే అసలు విషయం ఉంది. పుష్ప రెండో భాగం విషయంలో అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్‌కి పెద్ద కండీషన్ పెట్టారట. మరోసారి కథలో సీన్స్ చెక్ చేసుకుని పక్కా ప్లాన్ తో సినిమా షూటింగ్ వెళ్ళాలి. అంతే కాదు సినిమా సెట్స్ పైకి వెళ్లిన తర్వాత, 100 రోజుల లోపు షూటింగ్ పూర్తి చేయాలనేది కండీషన్. పుష్ప రెండో భాగాన్ని వచ్చే ఏడాది దసరాకు లేదా దీపావళికి విడుదల చేసేలా షూటింగ్‌ను పక్క ప్లాన్ చేసుకోవాలని అల్లు అర్జున్ సుకుమార్‌కి కండిషన్ పెట్టారట.
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో శేషాచల అడవుల్లో జరిగే పుష్ప సినిమాను సుకుమార్ చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే తొలి భాగంగాలో ఎర్ర చందనం కూలి నుంచి ఎర్ర చందనం మాఫియా డాన్ గా పుష్ప రాజ్ ఎలా దిగాడనేది చూశాం. రెండో భాగం చిత్రంలో పుష్పరాజ్ అల్లు అర్జున్ విలాన్ ఫహాద్ ఫాజిల్‌కు మధ్య సంఘర్షణలు ఏంటి అందులో పుష్ప రాజ్ ఎలా విజయం సాధించించాడనే కాన్సెప్ట్ మీద పుష్ప ది రూల్ ఉండబోతుంది.