Rajamouli: నాలుగు భారీ సినిమాలు కావడంతో వారం వ్యవధిలో విడుదలకు థియేటర్ల సమస్యలు ఎదురు కావొచ్చనే ముఖ్యమైన కారణంతో చివరి సమయంలో మూడు సినిమాలు వాయిదా వేశారు.
సంక్రాంతి వచ్చిందంటే చాలు స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద కళకళలాడుతూ ఉంటుంది. తమ సినిమాలతో బాక్సాఫీస్ దాడికి పోటీ పడుతుంటారు. తెలుగు వారికి సంక్రాంతి అనేది పెద్ద ఫెస్టివల్ ఈ సందర్భంలో సినీ ఇండస్ట్రీ సంక్రాంతి అనేది పెద్ద సీజన్ స్టార్ హీరోలు దర్శకనిర్మాతలు చివరి దశ తమ షూటింగ్లో ఉన్న సినిమాలను త్వరగా కంప్లీట్ చేసి సంక్రాంతి రేస్‌లో నిలబెట్టేందుకు తపన పడుతుంటారు. ప్రతి ఏడాది ఇదే ఆనవాయితీ. ఈ ఏడాది కూడా పలు పెద్ద హీరో సినిమాలు సంక్రాంతి రేస్ లో దిగాయి.
ఈ సంక్రాంతి కొంచం ఆసక్తిగా మారింది. రాజమౌళి దర్శకత్వంలో RRR జనవరి 7వ తేదీన పెద్ద అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి రానుంది. పాన్ ఇండియా హీరో ప్రభాస్ సినిమా రాధేశ్యామ్ కూడా జనవరి 14న గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ రెండు సినిమాలపై అభిమానులు పెట్టుకున్న అంచనాలు మాటలో వర్ణించలేము. ఇక పవన్ కళ్యాణ్ మరియు రానా మల్టీస్టారర్ కాంబోలో చిత్రం కూడా ఇదే సంక్రాంతికి రాబోతున్న భారీ సినిమా ‘బీమ్లా నాయక్’. ఇక ఇదే సంక్రాంతికి మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ మరియు దిల్ రాజు నిర్మాణంలో వెంకటేష్ F3 సినిమాలు సంక్రాంతి రేస్ రిలీజ్ కావాల్సి ఉండగా. RRR భారీ బడ్జెట్ అవ్వడం వలన అదేవిధంగా జనాల్లో భారీ డిమాండ్ RRRకి ఉండడం వలన ఈ మూడు సినిమాలు RRRకి సైడ్ ఇచ్చి వాయిదా వేశారు.
సర్కారు వారి పాట, భీమ్లా నాయక్ ఈ రెండు సినిమాలు రిలీజ్ డేట్స్ ముందుగా అనౌన్స్ చేసినప్పటికీ. నాలుగు భారీ సినిమాలు కావడంతో వారం కాల వ్యవధిలో విడుదలకు థియేటర్ల సమస్యలు ఎదురు కావొచ్చనే ముఖ్యమైన కారణంతో చివరి సమయంలో మూడు సినిమాలు వాయిదా వేశారు. ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్, ఏప్రిల్ నెలలో సర్కారు వారి పాట, అలాగే F3 చిత్రం ఏప్రిల్ 29న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో రాజమౌళి సోషల్ మీడియాలో స్పందించారు. RRR కోసం పవన్ కళ్యాణ్, మహేష్ బాబు మరియు దిల్ రాజు చేసిన త్యాగాన్ని స్పందించి రాజమౌళి వరుస ట్వీట్స్ పెట్టారు. పరిస్థితిని అర్థం చేసుకొని బీమ్లా నాయక్ చిత్రాన్ని వాయిదా వేసినందుకు పవన్ కళ్యాణ్ మరియు చినబాబులకు థాంక్స్. అలాగే ‘సర్కారు వారి పాట’ చిత్రం సంక్రాంతి సమయంలో పర్ఫెక్ట్ సినిమా అయినా గౌరవంతో సినిమాను సమ్మర్‌కి షిఫ్ట్ చేసినందుకు మహేష్ బాబుకి థాంక్స్. మరియు F3 సినిమాను సమ్మర్ రేస్‌లో ప్లాన్ చేసినందుకు దిల్ రాజు గారికి స్పెషల్ థాంక్స్ అంటూ రాజమౌళి వరుసగా ట్వీట్స్ చేశారు.