కథ:
లింగమార్పిడి దెయ్యం ప్రతీకారం తీర్చుకునే విధంగా, ఈ సినిమా ప్రధాన కథగా నడుస్తుంది. కామెడీ హారర్ మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్ తో మిగిలిన కథ నడుస్తుంది.
సినిమాకు ప్లస్:
బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన చిత్రాన్ని రీమేక్ చేయడం ఈ చిత్రానికి పెద్ద పాజిటివ్. రచయిత-దర్శకుడు లారెన్స్ ఈ చిత్రానికి అతిపెద్ద బలం. ఇటువంటి ప్రత్యేకమైన పాత్రను పోషించడంలో అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ ప్రత్యేకమైన శ్రద్ద తీసుకోవడాలో అర్హుడు. ఈ చిత్రంలో అతని పాత్ర మరియు అతని నటన లారెన్స్ పాత్రకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి కాని అది సినిమాకు బాగా ఉపయోగ పడింది. కైరా అద్వానీ మరియు ఇతర సహాయక పాత్రలు తమ పాత్రలకు చక్కగా న్యాయం చేశాయి. చాలా వరకు, ఈ చిత్రంనికి మెయిన్ ప్లస్, సాంకేతికంగా బాగా స్కోర్ చేసింది.
సినిమాకు మైనస్:
కాంచనలో థమన్ ఒరిజినల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని లక్ష్మి బామ్ లో కొన్ని చోట్ల ఫీల్ అవ్వొచ్చు. కానీ మొత్తం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కాంచన ఒరిజనల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని ఉపయోగించినట్లయితే బాగుండేది. ఒరిజనల్ చిత్రం లోని కొన్ని సన్నివేశాలు, అక్షయ్ కుమార్ చిత్రానికి తగినట్లుగా మార్చబడ్డాయి. కానీ మార్పులు కథకు బలాన్ని ఇవ్వవు. 9 సంవత్సరాల క్రితం ఈ చిత్రం యొక్క మొత్తం మసాలా, తెలుగు ప్రేక్షకుల నుండి మంచి స్పందన పొందింది. కానీ అదే మసాలా ఇప్పుడు హిందీ ప్రేక్షకులను ఆనందపరుస్తుందా అనేది నా మనసులోకి వచ్చిన ప్రశ్న.
లక్ష్మి బామ్:
వినోదాత్మక మాస్ మసాలా దెయ్యం చిత్రం!