‘కలర్ ఫోటో’, ఈ సినిమా ప్రముఖ తెలుగు స్ట్రీమింగ్ యాప్ “ఆహా”లో నిన్న సాయంత్రం రిలీజ్ అయింది. ‘మజిలీ’ సినిమాల్లో హీరో స్నేహితుడి పాత్రలో నటించిన సుహాస్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘కలర్ ఫొటో’. చాందిని చౌదరి హీరోయిన్. ఆమెకు అన్నయ్యగా విలన్ పాత్రలో సునీల్ నటించారు.
స్టోరీ:
జయకృష్ణ (హీరో) నల్లగా ఉంటాడు. దీపు అలియాస్ దీప్తి (హీరోయిన్)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడుతాడు. కానీ, అమ్మాయికి ఈ ప్రేమ విషయం చెప్పాడు. తాను నల్లగా ఉన్నానని నో అంటుందేమో అన్న ఫీలింగ్ తోనే మౌనంగా ఉంటాడు. జయకృష్ణని కాలేజీలో అందరి ముందు సీనియర్లు కొట్టడంతో దీపుతో స్నేహం ఏర్పడుతుంది. తరువాత స్నేహం ప్రేమగా మారుతుంది. ఈ విషయం దీపు అన్నయ్య ఎస్సై రామరాజు (సునీల్)కి తెలుస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది? అనేది మిగిలిన సినిమా.
సినిమాకి బలం:
సుహాస్ నటన తో అందరినీ ఆకట్టుకున్నాడు. అతని క్యారెక్టర్లో కామెడీకి స్కోప్ లేదు. కానీ, ఎమోషనల్ సీన్లలో బాగా చేశాడు. తన పాత్రకి పూర్తి న్యాయం చేయకలిగాడు. హీరోయిన్ చాందిని చౌదరి నాచురల్ పెర్ఫార్మన్స్ తో అందరినీ ఆకట్టుకుంది. క్లైమాక్స్ సీన్లలో ఆడియన్స్ ని ఏడిపించిందనే చెప్పాలి. సునీల్ కచ్చితంగా డిఫరెంట్ విలన్లా కనిపించడు. వైవా హర్ష తన కామెడీ టైమింగ్, డైలాగులు ఎప్పటిలాగా ఆకట్టుకున్నాడు. మిగతా నటీనటులు పరిధి మేరకు అందరూ బాగానే నటించారు పర్వాలేదానే చెప్పాలి. టెక్నికల్ వ్యూ లో మ్యూజిక్ డైరెక్టర్ సినిమాకి ప్లస్ పాయింట్. పాటలు బాగున్నాయి. మెలోడీలు మళ్ళీ మళ్ళీ వినాలని అనిపించేలా ఉన్నాయి. నేపథ్య సంగీతం సన్నివేశాల్లో ఎమోషన్ ఎలివేట్ చేసేలా ఉంది. సినిమాటోగ్రఫీ చాలా నీట్ గా ఉంది.
సినిమాకి మైనస్:
ప్రొడ్యూసర్ కమ్ రైటర్ సాయి రాజేష్ ప్యూర్ లవ్ స్టోరీ ని అందించారు. దానికి డైరెక్టర్ సందీప్ రాజ్ బెటర్ డైలాగ్స్ రాశాడు. కానీ, ప్రేక్షకులు అందరిని ఆకట్టుకునేలా ట్రీట్మెంట్ రాసుకోలేకపోయారు. దీనికి తోడు క్లైమాక్స్ దగ్గరకు వచ్చేసరికి ఎమోషన్ మరీ ఎక్కువ అయిందని అనిపిస్తుంది. పైగా, సీన్స్ ల్యాగ్ అనిపిస్తాయి. సినిమాను ఫ్యామ్లీ తో కలిసి చూడాలంటే కొంచెం ఆలోచించుకోవాలి. ప్రతి లవ్ స్టోరీకి లవ్ ట్రాక్ హైలైట్ అవ్వాలి. ఈ సినిమాలో అది మిస్ అయింది. హీరోయిన్ ప్రేమలో పడటానికి మొదట బలమైన కారణం చూపించలేదు. కొన్ని సీన్లతో ఆడియన్స్ కనెక్ట్ కాలేరు.