శంకర్ పక్కా తెలంగాణ బస్తీ కుర్రాడు. అతని మాట తీరు, వేషభాషలూ అన్నీ అలాగే ఉంటాయి. అతనికి తన కాకా మాటే వేదం. కాకా చెప్పాగా మాజీ మంత్రి కాశీ విశ్వనాథ్ ను చంపేస్తాడు. అతను ఇచ్చిన డబ్బుతో తను ప్రేమించిన అమ్మాయిని తీసుకుని గోవాకు వెళ్తాడు.
అక్కడ వారిద్దరూ వెళ్లగా కొందరు సీబీఐ ఆఫీసర్లు అటాక్ చేస్తారు. చాందిని కన్నుమూస్తుంది.
శంకర్ తప్పించుకుని హైదరాబాద్ వచ్చేస్తాడు. చాందినిని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అసలు కాకాకు కాశీ విశ్వనాథ్‌ను చంపమని ఎవరు చెప్పారు అనేది అసలు కథ, శంకర్ కి జమాల్ ఆచూకి తెలుస్తుంది. అతన్ని వెతుక్కుంటూ శంకర్‌తో పాటు సీబీఐ ఆఫీసర్ అరుణ్ కూడా వస్తాడు,
కాల్పుల్లో అరుణ్ కన్నుమూస్తాడు, శంకర్ గాయపడతాడు.
అరుణ్ గర్ల్ ఫ్రెండ్ సారా సైంటిస్ట్, తాను అప్పటిదాకా ఎలుకల మీద మాత్రమే ప్రయోగించిన ఆ పరిశోధన శంకర్ మీద ఉపయోగిస్తుంది, ఆ పరిశోధనను ఉపయోగించి అరుణ్ జ్ఞాపకాలను శంకర్ బుర్రలోకి చిప్ రూపంలో ఎక్కిస్తుంది, అరుణ్ జ్ఞాపకాలన్నీ శంకర్ మదిలోకి వచ్చి, అతను ఏం చేశాడు? సారా చేసిన ప్రయోగం ఫలించిందా లేదా? ఇంతకీ కాశీ విశ్వనాథ్‌ను చంపమని ఎవరు చెప్పారు? అసలు సీఎం ధనుంజయ్కీ, అతని మామ రామ్మూర్తి కి ఈ హత్యతో ఉన్న సంబంధం ఏంటి? చివరికి కాశీ విశ్వనాథ్ భార్య శంకర్‌కు ఏం చెప్పింది ? ఈ సందేహాలు
సెకండాఫ్‌లో తెలుస్తాయి.
ఇస్మార్ట్ శంకర్ సినిమా గురించి చెప్పాలంటే రామ్ ఇప్పటిదాకా ఎప్పుడూ మాట్లాడని తెలంగాణ యాసలో మాట్లాడటం, రామ్ లుక్ ఇంతకు ముందు ఆయన వేయని గెటప్ ఇది, కొన్ని సామెతలు తెలంగాణ యాసలో రామ్ చెబుతుంటే థియేటర్లలో విజిళ్లు వినిపించాయి,
క్లైమాక్స్ లో సిక్స్ బాగా ఆకట్టుకుంటుంది.
చాందిని పాత్రలో నభా నటేష్, సారా పాత్రలో నిధి గ్లామర్ ఎక్కడా తగ్గలేదు, హీరోయిన్ తన పాత్ర బాగానే చేసింది, క్రిమినల్ దగ్గర పెరిగిన శంకర్‌కు తాను హత్య చేయడానికి వెళ్తున్నది మాజీ మంత్రి అని తెలియకపోవడం చిన్న లాజిక్ ప్రాబ్లెం కనిపించింది, మనిషి మెదడులో చిప్ పెట్టి, అతని జ్ఞాపకాలను మరో వ్యక్తి బుర్రలోకి పంపడం, డాటా ట్రాన్స్ ఫర్ ఎంత లోడ్ అయిందో చూపించడం అవన్నీ సైన్సుఫిక్షన్ సినిమా అనుకోని కొన్ని లాజిక్స్ మరిచిపోయి, రామ్ మాట్లాడిన యాస, పూరి డైరక్షన్ మరియు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
1 Comment
?? nice