Pushpa: పుష్ప సినిమా ద్వారా చాలా కాలం తర్వాత థియేటర్ ముందు ఒక పండుగ వాతావరణంలో ఒక పెద్ద సినిమా రిలీజ్ చూస్తున్నాం. కరోనా తరువాత మళ్ళీ తెలుగు సినిమా ఊపు అందుకుందనే చెప్పాలి. పుష్ప సినిమా దాదాపు అనుమానాల్ని పటాపంచలు చేస్తూ వంద శాతం అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంది. రంగస్థలం తర్వాత సుకుమార్ పైన అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇటు హీరో అల్లు అర్జున్ “అలవైకుంఠపురంలో” లాంటి సూపర్ హిట్ తర్వాత చేసిన సినిమా అవ్వడంతో దానిని పూరీ పూర్తి చేసే విధంగా ఈ సినిమాలో డైరెక్టర్ అన్నీ జాగ్రత తీసుకున్నారనేది విశేషం.
టైటిల్: పుష్ప ది రైస్
రేటింగ్: 3 /5
నటినటులు: అల్లు అర్జున్, రష్మిక, సునీల్ఫ, హద్ ఫాజిల్, ధనంజయ, అనసూయ, అజయ్ ఘోష్.
కెమెరా మెన్: మిరోస్లా క్యూబా బ్రోజెక్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ – రూబెన్
మ్యూజిక్ డైరెక్టర్: దేవీ శ్రీ ప్రసాద్
ప్రొడ్యూసర్స్ : నవీన్ యర్నేని, రవి శంకర్
డైరెక్టర్ & రైటర్: సుకుమార్
సినిమా రిలీజ్ తేదీ: 17 డిసెంబర్ 2021
కథ:
స్టోరీ గురించి సింగిల్ లైన్లో చెప్పాలంటే. ఒక ఎర్రచందనం సిండికేట్ కంపెనీ అంతర్జాతీయ సంస్థ ఏజన్సీలో రెడ్వుడ్ను అక్రమంగా విక్రయించే లోడ్ యూనిట్ లో పనిచేసే కూలీలలో ఒకడు పుష్ప రాజ్. పుష్ప కూలీ నుండి తన అడుగును నెమ్మదిగా ముందుకు వేసి నెంబర్ వన్ డాన్ గా డాన్ గా ఎలా ఎదిగాడనేది కథ.
మైనస్:
పుష్ప సినిమా టైటిల్స్ లోనే మైనస్ ధ్వనిస్తుంది. కథకు సంబంధం లేకుండా యానిమేషన్లో జపాన్లో ఒక పెళ్లిలో గిటార్ ని బహుమతిగా ఇచ్చే సంస్కృతి గురించి వాయిస్ ఓవర్ లో టైటిల్స్ నడుస్తుంటాయి. మనం చూస్తుంది “పుష్ప” టైటిల్సేనా అని నొసట్లు చిట్లించేలోపు కాసేపట్లో ప్రేక్షకులకు మేటర్ అర్థమవుతుంది. ఎర్రచందనంతో ఆ గిటార్ తయారయింది అని. అది కూడా ప్రపంచం మొత్తంలో ఒక్క మన శేషాచలం అడవుల్లోనే దొరుకుతుందని చెప్పడంతో ప్రేక్షకులకు కథలో ఇంట్రస్ట్ పెరుగుతుంది. హీరో ఎంట్రీకి ఎక్కువ టైమ్ తీసుకోకుండా టైటిల్స్ అవ్వగానే కథ మొదటిలోనే పెట్టేసారు. హీరో ఎంట్రీ అయితే బాగుంది కానీ కథనం మాత్రం పడవ ప్రయాణంలా ఉంది ఎటువంటి మలుపులు ఉండవు.
“నార్కోస్” సినిమాలో డ్రగ్ – పుష్ప సినిమాలో ఎర్ర చందనం అంతే. ఆ సినిమాలో పాబ్లో ఎస్కోబార్ – ఈ సినిమాలో పుష్పరాజు ఇంతే తేడా. గ్రాఫ్ మొత్తం అక్కడనుంచి గిసినట్టుంది సుకుమార్. “నార్కోస్” సినిమాలో ఉన్న బిగువు, పట్టు, ఉత్కంఠ “పుష్ప” సినిమాలో ఉండవు. సర్కార్, రక్త చరిత్ర సినిమా ఛాయలు కూడా కనిపిస్తాయి. విలన్ అయిన సునీల్ తన బావమరిదికి ఒకడిని ఎలా కొట్టాలో, ఏ ఎముక విరగ్గొట్టాలో ఇడియా ఇస్తుంటాడు. అనసూయ పాత్ర చాలా క్యాజువల్ గా తన పని తాను చేసుకుంటూ పోతుంటుంది. ఇందులో జాలీరెడ్డి అని ధనుంజయ్ పాత్ర అచ్చం రక్తచరిత్రలోని కామాంధుడైన బుక్కారెడ్డి పాత్ర జెరాక్స్ లాగా కాకుండా లైట్ గా ఉంటుంది. విలాన్ పాత్రకు సునీల్ సరిపోలేదనే అనిపిస్తుంది. ఈ చిత్రంలో సునీల్ పాత్ర పెద్ద మైనస్ అనే చెప్పాలి.
ప్లస్:
అల్లు అర్జున్, అజయ్ ఘోష్ ఈ ఇద్దరే చాలా కన్విన్సింగ్ గాను చాలా పవర్ఫుల్ గాను ఉన్న పాత్రలు. మిగిలిన పాత్రలు బిల్డప్ ఎక్కువ మరి బిల్ట్ క్వాలిటీ చాలా తక్కువ అన్నట్టున్నాయి. ఐటెం సాంగులో సమంత కనీసం రిజిస్టర్ కాకపోవడమే మంచిదనేలా ఉంది. క్లైమాక్స్ ముందు వచ్చే ఫహద్ ఫాజిల్ ట్రాక్ మొత్తం అయితే చాలా బాగుంది అనే చెప్పాలి. పాటల్లో బ్యాక్ గ్రౌండ్ విషయంలో మాత్రం రెచ్చిపోయిన దేవీశ్రీప్రసాద్. పాటలన్నీ స్క్రీన్ మీద చాలా బాగుంది, కెమెరా వర్క్ విజువల్ వర్క్ చాలా రిచ్ గా కనిపించింది. లవ్ ట్రాక్ ని కామెడితో మిక్స్ ఓకే అనిపిస్తుంది. సుకుమార్ దర్శకత్వమంటే క్యారెక్టర్స్ ని క్యారెక్టర్ ని కళ్ళముందు నిలబెట్టేవాడు. కానీ ఆ మార్క్ ఈ సినిమాలో తగ్గింది.
అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు సామి సామి మరియు ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా వంటి పాటలు చూసి సంతోషించవచ్చు, పీటర్ హెయిన్, రామ్-లక్ష్మణ్ కొన్ని ఆకర్షణీయమైన యాక్షన్ సన్నివేశాలు బాగుంది. అల్లు అర్జున్ యాసనుతో అతను ఇంత పెద్ద చిత్రాన్ని భుజాన వేసుకుంటే, సాధారణంగా అతను మిమ్మల్ని నవ్వించేలా చేస్తాడు.
కంక్లూజన్:
పుష్ప పంచ్ డైలాగ్లు, చిత్తూరు యాసలో మాట్లాడే పాత్రలు మరియు అది సెట్ చేయబడిన ప్రాంతం, ఇంకా లోతుగా ఉండే నేటివిటీతో కూడిన పూర్తి ఎంటర్టైన్మెంట్ మసాలా చిత్రంగా రూపొందించడానికి సుకుమార్ ప్రత్యేకమైన నిర్దేశించని ప్రాంతంలోకి వెళ్ళి పక్క ప్లాన్ వేసి ఈ సినిమా తెరకెక్కించినట్టు తెలుస్తుంది. పుష్ప మొదటి బాగం అంచనాలకు తక్కువ కావడాతో పుష్ప రెండవ భాగంమాత్రం ప్రస్తుతానికైతే ఎప్పుడెప్పుడొస్తుందా అనే ఆసక్తి ఆడియన్స్ కు కలగట్లేదు అన్నది విశేషం.