నిహారిక డెస్టినేషన్ వెడ్డింగ్ ఎంత గ్రాండో తెలియాలంటే ఈ ఒక్క విషయం చాలు. మెగా ఫామిలీలోని హీరోలు, వారి కుటుంబ సభ్యులు, మరియు బంధువులు అందరూ ప్రైవేట్ ఛార్టర్డ్ ఫ్లైట్ లో వెళ్ళడం మీడియాలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఒక్కో ఫామిలీ ఒక్కో కార్లో వెళ్లినట్లుగా ఒక్కో ఫామిలీ ఒక్కో విమానం వేసుకొని ఉదయ్ పుర్ వెళ్ళడం చూస్తే మెగా ఫ్యామిలీ వాళ్ళ రిచ్ లైఫ్ స్టైల్ ఏంటో అర్ధమౌతుంది.
సమంత, చైతన్య డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా ఇలాగే గోవాలో గ్రాండ్ గా జరిగింది. ఐతే, మెగా ఫ్యామిలీతో పోల్చితే కొంత తక్కువే. నిహారిక సినిమాలో నటించి పెద్దగా రీచ్ అవ్వలేదు. కానీ పెళ్లి హంగామా మాత్రం ఇప్పుడు నేషనల్ లెవెల్ లో ట్రేండింగ్ టాఫిక్ అయింది. వెడ్డింగ్ ఫోటోస్ సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.