టాలీవుడ్ సినిమా ఇండిస్ట్రీలో పలు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న కళాతపస్వి డైరెక్టర్ కె.విశ్వనాథ్. మెగాస్టార్ చిరంజీవికి, ఈయనకు మధ్య ఉన్న గురు శిష్యుల సంబంధం అందరికి తెలిసిందే.
విశ్వనాథ్ దర్శకత్వంలో చిరు నటించిన ‘శుభలేఖ, ఆపద్భాంధవుడు, స్వయంకృషి’ వంటి ఇంకా ఎన్నో సినిమాలు ఇద్దరు కలిసి చేశారు. మెగాస్టార్ కెరీర్లో మాస్ ఆడియెన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గర చేశాయి ఈయన సినిమాలు. దీపావళి సందర్భంగా.. సతీసమేతంగా మెగాస్టార్ చిరంజీవి, కె.విశ్వనాథ్ కలుసుకోవడం విశేషం. దీపావళి సంధర్బంగా తన శిష్యుడు తన ఇంటికి రావడం పట్ల కె.విశ్వనాథ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాసేపు ఇద్దరు తమ అప్పటి సినిమా మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పండగ అంటే మన ఆత్మీయులతోను, ఇంట్లో పెద్దవారితో సమయం గడపటం. అందుకే ఈ పండగ రోజున మా సినిమా కుటుంబంలోని పెద్దాయన, నాకు గురువు, మార్గదర్శి, ఆత్మబంధువు కె.విశ్వనాధ్ గారిని కలిసి, ఆ దంపతులని సత్కరించుకున్నాను. వారితో గడిపిన సమయం సంతోషాన్ని సంతృప్తినిచ్చింది” అన్నారు.