మనం ఒక వ్యక్తికి చిన్న సాయం చేస్తేనే సోషల్ మీడియాలో ప్రపంచం మొత్తానికి తెలియాలనుకునేలా సెల్ఫీలు పోస్ట్ వేసే రోజులివి.
కానీ పునీత్ రాజ్‌కుమార్ వేలమంది సాయం చేసినా బయటకు రానివ్వలేదు. అలాంటి వ్యక్తిని మనం కోల్పోవడం నిజంగా దురదృష్టకరం’’ అని ఎస్.ఎస్.రాజమౌళి అన్నారు. రాజమోళి తాజాగా బెంగళూరుకు వెళ్లి పునీత్ ఇంటికి వెళ్లారు. పునీత్ చిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. ‘‘నాకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. పునీత్ రాజ్ మన మధ్య లేరన్న విషయం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఆయన మరణం తనని కలచివేసిందని అన్నారు.
నాలుగేళ్ల క్రితం బెంగళూరుకు వచ్చినప్పుడు పునీత్‌ని కలిశాను. సొంత మనిషిలా నన్ను చూసుకున్నారు. స్టార్ హీరోతో మాట్లాడుతున్నాననే భావన నాకు కలగలేదు. పునీత్ మరణ వార్త విని ఎంతో షాక్ అయ్యాను. ఆయన ఎంతోమందికి సాయం చేశారని మరణం తర్వాతే అందరికీ తెలిసింది’’ అని రాజమౌళి అన్నారు.