హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన ప్రియుడు గౌతమ్ తో కొత్త జీవితంలోకి ఆనందంగా అడుగు పెట్టింది. తాజాగా కాజల్ హానీమూన్ వెళుతున్నటు హింట్ ఇచ్చింది.
లాక్ డౌన్ వల్ల అతి తక్కువ మంది అతిథులతో వీరి పెళ్లి ముంబైలో ఘనంగా జరిగింది. కాజల్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు భర్తతో కలిసి హనీమూన్ ఎంజాయ్ చేయడానికి సిద్దామవుతోంది ఈ విషయాన్ని కాజల్ అగర్వాల్ ఇన్స్టాగ్రామ్ లో బయలుదేరాటానికి సిద్దంగా ఉన్నాం అంటూ ఫోటో తో ఈ రోజు హింట్ ఇచ్చింది. అయితే ఏ ప్లేస్ కి వెళుతున్నది చెప్పలేదు. పెళ్లికి ముందు అసలు అతడితో కనీసం పరిచయం వున్నట్టు కూడా ఎక్కడా తెలియనివ్వలేదు. కానీ పీకల్లోతు ప్రేమలో వున్నామని, ఒకరిని విడిచి ఒకరం వుండలేమని పోస్టలు మీద పోస్ట్ పెట్టేస్తుంది.
కాజల్ పెళ్లికి తరువాత అటు సంసారం, ఇటు సినిమా రెంటికీ ఇంపార్టంట్ ఇచ్చేలా ప్లాన్ చేసుకుంటోంది. కాజల్ ప్రస్తుతం చిరంజీవితో ‘ఆచార్య’ కమల్ హాసన్ తో ఇండియన్-2 మంచు విష్ణుతో ‘మోసగాళ్ళు’ సినిమాలో నటిస్తుంది. పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటిస్తానని కాజల్ తాజా చామచారం.