20 Years of Prabhas: ప్రభాస్ హీరోగా తెర మీద కనిపించి సరిగ్గా ఈ రోజుతో 20 ఏళ్లు పూర్తయింది. ఈశ్వర్ అనే సినిమాతో 2002 జులై 28 న రామానాయుడు స్టూడియోలో ప్రభాస్ హీరోగా కెరీర్ స్టార్ట్ చేశారు. ఈశ్వర్ సినిమాతో మొదలు పెట్టి డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు చేసి మాస్ ఇమేజ్ అందుకున్న ప్రభాస్ ఈ రోజు ‘ఆదిపురుష్’ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా కూడా మారబోతున్నారు. ఆదిపురుష్ సినిమాను హాలీవుడ్లోకూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ప్రభాస్ హీరోగా నేటికీ 20 ఏళ్ళు పూర్తికావడంతో అభిమానులు ఈ ఆనందాన్ని సంబరంగా జరుపుకున్నారు. కృష్ణం రాజు మరియు ప్రభాస్ ఫాన్స్ అధ్యక్షుడు జె ఎస్ ఆర్ శాస్త్రి ఆధ్వర్యంలో హైద్రాబాద్‌లో కృష్ణంరాజు ఇంట్లో సెలెబ్రేషన్స్ జరుపుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానులతో పాటు ప్రభాస్‌ని హీరోగా పరిచయం చేసిన దర్శకుడు జయంత్ సి పరాన్జీ, నిర్మాత అశోక్ కుమార్‌లతో పాటు కృష్ణం రాజు పాల్గొని కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.
రెబెల్ స్టార్ కృష్ణం రాజు మాట్లాడుతూ:
ప్రభాస్ హీరోగా పరిచయం అయి అప్పుడే 20 ఏళ్ళు గడచిపోయాయా అనిపిస్తుంది. ప్రభాస్‌ని హీరోగా మా గోపీ కృష్ణ బ్యానర్లో పరిచయం చేయాలనీ అనుకున్నం. ఒకరోజు నిర్మాత అశోక్ కుమార్, దర్శకుడు జయంత్ వచ్చి ప్రభాస్‌ని పరిచయం చేసే అవకాశం మాకు ఇవ్వమని నన్ను అడిగారు. ఈశ్వర్ కథ తప్పకుండా అందరికి బాగా నచ్చుతుందన్న నమ్మకంతో అశోక్ కుమార్‌కు ఓకే చెప్పాను. ఎంతో బాధ్యతగా జయంత్, అశోక్ ఇద్దరు కలిసి ఆ సినిమా మంచి విజయాన్ని ప్రభాస్ కి అందించారు. పైగా అశోక్ కుమార్ ఒక నిర్మాత అయి ఉండి ఆ సినిమాలో విలన్‌గా నటించాడంటే అయన గట్స్‌కు హ్యాట్సాఫ్ చెప్పాలి. ప్రభాస్ మొదటి సినిమా చూసి పెద్ద హీరో అవుతాడని అనుకున్నాం. కానీ ఎవరు ఊహించని విధంగా ఇలా పాన్ ఇండియా స్టార్ అవుతాడు అనుకోలేదు. దానికి అతని శ్రమ, పట్టుదలతో పాటు మా అభిమానుల అండదండలు ఉండడమే ముఖ్యం. ప్రభాస్‌ని చుస్తే చాలా ఆనందంగా ఉంది. ఇంకా మంచి విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు.
ఈశ్వర్ చిత్ర దర్శకుడు మాట్లాడుతూ :
నేను పరిచయం చేసిన హీరో ఈ రోజు ఒక పాన్ ఇండియా స్టార్ గా అవుతాడని నిజంగా నేను ఎప్పుడు అనుకోలేదు. నిజంగా నా హీరో ఈ రేంజ్ కి వెళ్లడం మరచిపోలేని అనుభూతి. ఈ సినిమా సమయంలో చాలా మంది హీరోలను చూసాము, కానీ ఓ కాఫీ షాప్‌లో ప్రభాస్ ని చూసి ఈ అబ్బాయి బాగా ఉన్నాడు. మన కథకు సరిపోతాడని చెప్పగానే అశోక్ వెళ్లి కృష్ణం రాజునూ కలవడం. మమ్మల్ని నమ్మి సపోర్ట్ అందించిన కృష్ణం రాజు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు.
ఈశ్వర్ నిర్మాత మాట్లాడుతూ :
నిజం చెప్పాలంటే ఈశ్వర్ సినిమా కథ అనుకున్నాకా మా అబ్బాయిని హీరోగా పరిచయం చేయాలనీ అనుకున్నాను. కానీ అపుడు మా అబ్బాయి చదువుకుంటున్నాడని వేరే హీరో కోసం చూసాం. వెంటనే కృష్ణం రాజు గారు ఒకే చెప్పడంతో ఈశ్వర్ తెరకెక్కింది. నిజంగా ఈశ్వర్ సినిమా అప్పుడే 20 ఏళ్ళు పూర్తీ చేసుకుందా అని అనిపించింది. మా సినిమాతో ఎదిగిన మా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను అన్నారు.
కృష్ణం రాజు భార్య మాట్లాడుతూ :
మా ప్రభాస్ నటుడిగా కెరీర్ మొదలుపెట్టి నేటికీ 20 ఏళ్ళు అయిందంటే నిజంగా నేను నమ్మలేక పోతున్నాను. ప్రభాస్ కు నేనే పెద్ద అభిమానిని, ఈ విషయం తనతో చెబితే అవును అంటాడు. అంత పెద్ద స్టార్ ఇమేజ్ వచ్చినా కూడా అందరితో చాలా చక్కగా ఉంటాడు. ప్రభాస్‌ని చూస్తుంటే పెద్దమ్మగా చాలా గర్వంగా ఉంది. ప్రభాస్ మరిన్ని విజయాలు అందుకుంటూ ఇంకా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను అన్నారు.