Kajal aggarwal: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తల్లి కాబోతుందన్న విషయాన్ని ఆమె భర్త గౌతమ్ కిచ్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు.
కాజల్-గౌతమ్ జంట గోవాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ సమయంలో గౌతమ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను షేర్ చేశారు. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తల్లి కాబోతుందన్న ఈ విషయాన్ని ఆమె భర్త గౌతమ్ కిచ్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. అందులో ‘2022లో నిన్నే చూస్తున్నాను’ అని కామెంట్‌తో పాటు ప్రెగ్నెంట్ లేడీ ఎమోజీని కాడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు గౌతమ్. ఈ పోస్ట్ ద్వారా కాజల్ ప్రెగ్నెంట్ అనే విషయాన్ని గౌతమ్ కన్ఫర్మ్ చేసినట్లు అయ్యింది. అభిమానులు మరియు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో వారికి అభినందనలు తెలియజేస్తున్నారు.
కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ఉమ అనే బాలీవుడ్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం విడుదలకు సన్నద్ధమవుతుంది. సినిమాలో తానొక డిఫరెంట్ అమ్మాయి పాత్రలో కనిపించనుంది కాజల్ అగర్వాల్. ఈ చిత్రం ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించరు. ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ లో బీసీగా ఉన్న కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నటనకు సిద్ధమేనని పెళ్ళికి ముందు ప్రకటించిన విషయం అందరికీ తెలుసు. చిరంజీవి ‘ఆచార్య’ లో పెళ్లి తర్వాత కాజల్ నటించిన చిత్రం. ఈ సినిమా ఫిబ్రవరి 4న విడుదలకు సిద్దమౌతుంది. శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2లోనూ కమల్ హాసన్‌తో ఈమె కలిసి నటించింది. మరి ఈ సినిమాలన్నీ విడుదల తరువాత కాజల్ హీరోయిన్గా రేస్ లో ఉంటుందా లేదో వేచి చూడాలి.
నాగార్జునతో సినిమాలో నటించే అవకాశం వచ్చినా ప్రెగ్నెన్సీ కారణంగానే కాజల్ అగర్వాల్ నటించడానికి అంగీకరించలేదు. 2004లో నటిగా ఈమె తన సినిమా కెరీర్‌ను స్టార్ట్ చేసి, లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కాజల్ అగర్వాల్ వెండి తెరపై పరిచయమైంది. ఆ రోజు నుంచి తెలుగు తమిళ భాషలో వరుస అవకాశాలను దక్కించుకొని స్టార్ హీరోయిన్ ప్లేస్ ను దక్కించుకుంది. తెలుగులో చిరంజీవి, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, మహేశ్ స్టార్ హీరో సినిమాలో నటించింది.