Prabhas: చిరంజీవి, ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా అందరూ తలా రూ. 25 లక్షలను విరాళంగా ప్రకటించగా. ప్రభాస్ మాత్రం కోటి రూపాయలు విరాళంగా ప్రకటించి అటు టాలీవుడ్ ఇటు అభిమానులను ఆశ్చర్యపరిచాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేసిన విషయం మన అందరికి తెలుసు. అకాల వరదల కారణంగా ప్రజలకు ఆస్తులు, పంటలు నష్టానికి గురైయ్యారు. ఈ పరిస్థితిలో ప్రభుత్వానికి అండగా టాలీవుడ్ ముందుకు వచ్చింది. చిరంజీవి, ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా అందరూ తలా రూ. 25 లక్షలను విరాళంగా ప్రకటించారు.
అయితే తాజాగా ప్రభాస్ మాత్రం కోటి రూపాయలు విరాళంగా ప్రకటించి అటు టాలీవుడ్ ఇటు అభిమానులను ఆశ్చర్యపరిచాడు. కానీ ప్రభాస్ ఇలా పెద్ద రేంజ్లో విరాళాలు ప్రకటించడం తనకు కొత్తేమీ కాదు. ఇలా జనాలకు అవసరమైనప్పుడు తన వంతు ఆర్థిక సాయం చేసి ప్రజలకు అండగా నిలబడుతూనే ఉన్నాడు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, కరోనా సమయంలో నాలుగు కోట్ల విరాళాన్ని ప్రకటించి ప్రజలకు అండగా నిలబడ్డాడు. ఇక హైద్రాబాద్ వరదల సమయంలోనూ ప్రభాస్ తన వంతు సాయం చేసి, తన గొప్ప మనసును చాటుకున్నాడు. కానీ ప్రభాస్ మాత్రం ఎక్కడా కూడా పబ్లిసిటీ చేసుకోడు. అందుకే అందరూ అతన్ని డార్లింగ్ అని పిలుస్తుంటారు.
ప్రభాస్ ఎప్పుడూ విరాళం అందించినా, తన పాన్ ఇండియా హీరో స్థాయికి తగ్గట్టుగానే ఉంటుదని టాక్ ఉంటుంది. ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. రాధే శ్యామ్ సినిమా విడుదలకు సిద్దంగాకా. ఆది పురుష్ చిత్రం షూటింగ్ పూర్తి చేశాడు. సలార్ రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకొని ఇప్పుడు ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టాడు.