Sowndarya Rajinikanth: ధనుష్ – ఐశ్వర్య విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో విడివిడిగా పోస్టలు ద్వారా ప్రకటించడం యావత్ సినీ పరిశ్రమను షాక్‌కు గురి చేసింది.
ఇండియన్ సినిమాలో అందరూ సూపర్ స్టార్ అని పిలవబడే రజనీకాంత్ పెద్ద కుమార్తె అయిన ఐశ్వర్య హీరో ధనుష్‌తో 2004లో వివాహం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఇండియా మొత్తం షాక్ అయేలా ధనుష్, ఐశ్వర్యల ఆకస్మిక విడాకుల ప్రకటన ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం కోలీవుడ్ మరియు సినిమా అభిమానులలో చర్చనీయాంశమైంది. వీరి ఇద్దరికీ యాత్ర మరియు లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
గత రాత్రి వీరిద్దరూ విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో విడివిడిగా పోస్టలు ద్వారా ప్రకటించడం యావత్ సినీ పరిశ్రమను షాక్‌కు గురి చేసింది. దీనికి సంబంధించి ఇద్దరూ తమ ట్విటర్ పేజీలలో వేర్వేరు ప్రకటనలను పోస్ట్ చేశారు. అందులో, ‘మా ఇద్దరినీ స్నేహితులు, దంపతులుగా, తల్లిదండ్రులు మరియు శ్రేయోభిలాషులుగా కలిసి నడిచిన 18 సంవత్సరాల ప్రయాణం మాకు చాలా విషయాలు నేర్పింది.
ఈ రోజు మా మార్గాలు వేరయ్యే పరిస్ధిలో ఉన్నాము. మేమిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మరియు మేమిద్దరం ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి సమయం తీసుకుంటాము. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించండి మరియు దీనిని ఎదుర్కోవటానికి మాకు అవసరమైన వ్యక్తిగత మానవ స్వేచ్ఛను ఇవ్వండి అని పోస్ట్ చేశారు.
ఐశ్వర్య విడాకుల ప్రకటన తర్వాత, ఆమె చెల్లెలు సౌందర్య తన ట్విట్టర్ పేజీలో ప్రొఫైల్ ఫోటోను మార్చింది. మొదట ధనుష్‌తో సహా కుటుంబం మొత్తం ఉన్న ఫోటోని సౌందర్య మార్చింది. ఇప్పుడు రజనీతో ఇద్దరు కుమార్తెలు ఉన్న చిన్ననాటి ఫోటోను ప్రొఫైల్ ఫోటోగా మార్చింది.
ఈ నేపధ్యంలో ట్విటర్ ప్రొఫైల్ ఫోటో మార్చినది ఐశ్వర్యగా భావించి సోషల్ మీడియాలో కామెంట్ ద్వారా రజినీకాంత్ అభిమానులు తిట్టడం మొదలుపెట్టారు. మీ వల్ల మా సూపర్ స్టార్ కి ఎంత కష్టం. ఈ వయసులో మా తలైవన్ ఎలా తట్టుకుంటాడని వ్యాఖ్యానించడం మొదలు పెట్టారు. మరి కొందరు అభిమానులు ప్రొఫైల్ ఫోటో మార్చింది రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య అని చెప్పినా, ఐశ్వర్యగాను అప్పటి నుంచి పట్టు వదల కుండా అభిమానులు కామెంట్లు చేస్తూనే ఉన్నారు.