Naresh: సీనియర్ నటుడు నరేష్ ఇప్పుడు వార్తల్లో వైరల్ అవుతున్నారు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో చిత్రాల్లో హీరోగా మెప్పించిన నరేష్ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బాగా బీసీగా ఉన్నారు. ఆ తరువాత కొన్నాళ్ళు రాజకీయాల్లో తిరిగారు. అది కలిసి రాకపోవటంతో ఆయన మళ్ళీ సినిమాల్లోనే స్థిరపడ్డారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి వైవిధ్యమైన పాత్రలో మెప్పిస్తూ వస్తోన్న నరేష్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) అధ్యక్షుడిగా, కార్యదర్శిగానూ పని చేశారు. అయితే ఇది వరకు రానంతగా పేరు ఒక్కసారిగా వార్తల్లో వైరల్ అవుతున్నారు. వైరల్ అవుతున్న న్యూస్ అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అందరికీ తెలిసిందే. నరేష్ వ్యక్తిగత సమస్యలు బయటకు రావటం. అవి సోషల్ మీడియాలో వైరల్ అయి ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
అరవై ఏళ్లు దాటిన ఈ సీనియర్ నటుడు నరేష్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి అందరికీ తెలుసు. తాజాగా ఇప్పుడు మీడియాలో పర్సనల్ గొడవలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటి వరకు నరేష్ మూడు పెళ్లిళ్లు గురించి పట్టించుకోని జనం, సోషల్ మీడియాలు ఇప్పుడు ఆయన పెళ్లిళ్లపై పదే పదే ఆరా తీస్తున్నారు. దానికి తగ్గట్టే సోషల్ మీడియాలు కూడా న్యూస్ ని హల్ చల్ చేసి వైరల్ చేస్తున్నాయి. అసలు నరేష్ మూడు పెళ్లిళ్ల కథేంటనే వివరాల్లోకి వెళితే. సీనియర్ సినిమాటోగ్రాఫర్ శ్రీను కుమార్తెను మొదట వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు ఉన్నాడు అతనే నవీన్ విజయ్ కృష్ణ. అతను హీరోగా రెండు, మూడు సినిమాల్లోనూ నటించారు.
సీనియర్ నటుడు నరేష్ తర్వాత ప్రముఖ రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు రేఖా సుప్రియను రెండోసారి వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు పుట్టారు. తర్వాత రేఖా సుప్రియతో నరేష్ మనస్పర్ధలు ఏర్పడి విడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ మాజీ మంత్రి రఘువీరా రెడ్డి సోదరుడి కుమార్తె అయిన రమ్య రఘపతిని మూడో సారి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు ఉన్నారు. ఇప్పుడు మళ్లీ నరేష్, మూడో భార్య రమ్య రఘపతికి విడాకుల నోటీసులు పంపారు. కానీ రమ్య రఘుపతి విడాకులు ఇవ్వనని చెప్పటం. విషయం సోషల్ మిడియలో రావడం గొడవలు స్టార్ట్ అయ్యాయి.
ఇవన్నీ ఒక పక్కన ఉంటే నటి పవిత్రా లోకేష్‌ను ఆయన పెళ్లి చేసుకోకుండా కలిసి జీవిస్తున్నారని ఇలా పలు రకాలైన వార్తలు సోషల్ మిడియలో వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ఆ వార్తలు నిజమని తాజాగా జరిగిన గొడవలతో రుజువు అయ్యాయి. అయితే నరేష్, పవిత్రా లోకేష్ తామిద్దరం మంచి స్నేహితులమని వారు చెబుతున్నారు. సీనియర్ నటుడు నరేష్ మూడో భార్య అయిన రమ్య రఘుపతి అయితే మాత్రం నరేష్, పవిత్రా లోకేష్ పెళ్లి చేసుకున్నారంటున్నారు అన్న వార్తను చెపుతున్నారు. మరి అయితే ఈ వివాదం ముందు ముందు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి.