రాజమౌళి RRR ద్వారా మరో అద్భుతాన్ని సృష్టించే పనిలో 24 గంటలు నిమగ్నమై ఉన్నారు. భారతదేశ చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయిన ఇద్దరు పోరాట యోధులు, మన్యం ప్రజలు కోసం పోరాడిన ధీరులు అయిన అల్లూరి సీతారామ రాజు , కొమురం భీమ్ పాత్రను తన సినిమా కోసం ఎంపిక చేస్తున్నారు . ఈ వీరులకు కల్పిత కథ జతచేసి ఓ అద్భుతాన్ని అభిమానుల కోసం తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు . ఇంత గొప్ప పాత్రలను పోషించే నటులు కూడా అంతే గొప్పగా ఉండాలని ఎన్టీఆర్ రామ్ చరణ్ లను ఎంపిక చేశారు. ఐదు నెలల క్రితం రామరాజు పాత్రలో రామ్ చరణ్ ను పరిచయం చేశారు. ఇప్పడు కొమురం భీమ్ ఎన్టీఆర్ ను చూపించారు. అంతే కాదు ఎన్టీఆర్-చరణ్ పాత్రలను తీర్చిదిద్దిన తీరు చూసి సినిమా బ్లాక్ బస్టర్ ఖాయం అనే భావనకు ఆందరు వస్తున్నారు.
అయితే ఇక్కడే అసలు విషయం మొదలైయింది. అగ్రదర్శకుడిగా నీరాజనాలు అందుకొంటున్న రాజమౌళిపై కాపీ క్యాట్ అనే ముద్ర వేసే ప్రయత్నాలు మగధీర నుంచే నెటిజన్లు ప్రారంబించారు. బాహుబలి సినిమా సమయంలోనూ ఇదే ప్రచారం ఓ పక్క పెద్దగా జరిగింది. కానీ ఆ సినిమా సాధించిన విజయ ప్రవాహంలో ఈ విమర్శలు హూద్ హూద్ తుఫానులా కొట్టుకుపోయాయి. ఇదిలా ఉంటే, ఇప్పుడు RRR సినిమా విషయంలోనూ రాజమౌళిపై ఇప్పుడు అదే విమర్శల దాడి మొదలైయింది. కొమురం భీమ్ టీజర్ లో అగ్నిపర్వతం బద్దలైన సీన్ నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ నంచి రాజమౌళి కాపీ కొట్టేశారని, ఇంకా కొన్ని షాట్లు హాలీవుడ్ సినిమాలోనుంచి కాపీ చేశారని కొంత మంది మేధావులు విమర్శిస్తున్నారు. ఈ రెండు సెకన్ల టీజర్ కోసం రాజమౌళి స్వయంగా అగ్నిపర్వతం నిర్మించి బ్లాస్ట్ చేయాలేమో మరి. అభిమానుల మినహాయింపు ఏంటో మరి ఎవరికి అర్దం కాదు.