Prabhas: ఆదిపురుష్ సినిమా కోసం ప్రభాస్ రెమ్యూనరేషన్ విషయం మళ్ళీ హైలెట్ న్యూస్ గా మారింది, బాలీవుడ్ స్టార్లు ఖంగు తిన్నట్టు టాక్ జరుగుతుంది.
బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ రెమ్యూనరేషన్లో భారీ స్థాయిలో పెరిగాయి. ప్రభాస్ ఆదిపురుష్ రెమ్యూనరేషన్ గురించి ఎప్పుడూ చర్చల్లోకి వస్తూనే ఉంటుంది. సాహో, రాధే శ్యామ్ వంటి సినిమాలకు పెద్ద రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇంచు మించు ప్రభాస్ వంద కోట్లు తీసుకుంటున్నాడని టాక్ అయితే ఉంది. అయితే రానున్న సినిమాల్లో ప్రభాస్ రెమ్యూనరేషన్ మరింత భారీగా పెరిగే అవకాశలు ఉన్నాయని తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ సినిమాకి రెమ్యూనరేషన్ హాట్ టాపిక్‌గా మళ్ళీ మొదలైంది. ఇది వరకు నటించిన సినిమాల కోసం ప్రభాస్ వంద కోట్లు తీసుకున్నారనే టాక్ ఉండేది. కానీ ప్రస్తుతం తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ప్రభాస్ తన రెమ్యూనరేషన్ పెంచేశాడని టాలీవుడ్ లో టాక్. ప్రభాస్ మొత్తానికి రూ. 120 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. ఆదిపురుష్ షూటింగ్ ప్రారంభం సమయంలో కొన్ని గాసిప్స్ పుట్టుకొచ్చాయి. ప్రభాస్ ఆదిపురుష్ కోసం 50 రోజులు డేట్స్ ఇచ్చాడని, రోజుకి మూడు కోట్ల చొప్పన 50 రోజులకు మొత్తం 150 కోట్లు తీసుకుంటున్నాడని టాక్ వచ్చింది. అయితే బాలీవుడ్లో ప్రభాస్ రెమ్యూనరేషన్ విషయం మళ్ళీ హైలెట్ న్యూస్ అవుతోందట.
తాజాగా ఆదిపురుష్ కోసం రూ. 120 కోట్లు అడిగాడని బాలీవుడ్లో కథనాలు వస్తున్నాయి. 120 కోట్లు ఇచ్చేందుకు టీ సిరిస్, భూషణ్ కుమార్ అంగీకరించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ రెమ్యూనరేషన్ విషయం తెలిసి బాలీవుడ్ స్టార్లు ఖంగు తిన్నట్టు టాక్ జరుగుతుంది. బాలీవుడ్లో టాప్ రెమ్యూనరేషన్ లో అక్షయ్ కుమార్ ఉంటాడు. అతను వంద కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడని, ఇప్పుడు ఆయన్ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బీట్ చేసేశాడు. మొత్తానికి ఆదిపురుష్ మాత్రం వెండితెరపై ఓ మహాకావ్యం, ఇది సినిమా కాదు అంతకు మించిన అనుభూతి, ఫీలింగ్ అంటూ ప్రభాస్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయిందో మన అందరికీ తెలిసిందే.