Allu Arjun: మొత్తంశెట్టి మీడియా బ్రదర్స్ తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. బ్రదర్స్‌లో ఒకరైన ముత్తంశెట్టి కృష్ణప్రసాద్ అల్లు అర్జున్ వ్యక్తిగత విషయాలతో పాటు, అల్లు ఫ్యామిలీ విషయాల గురించి ఆయన మీడియాలో మాట్లాడారు.
సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చే గాసిప్స్ సెలబ్రిటీల గురించి, వారి పర్సనల్ రిలేషన్స్ గురించి రిగులర్ గా మీడియాలో ఏదో ఒక చర్చ నడుస్తుంటే ఉంటుంది. గాసిప్స్ కోసం ఇటు జనాలు అటు అభిమానుకు సైతం ఇలాంటి వార్తల కోసం తెగ ఇంట్రెస్ట్ చూపుతుంటారు. ప్రస్తుత విషయం ఏమిటంట గత కొన్ని రోజులుగా మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీల మధ్య గ్యాప్ వచ్చిందనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిన సంగతి. ప్రస్తుతం తాజాగా అల్లు అర్జున్ మేనమామ అయిన ముత్తంశెట్టి కృష్ణప్రసాద్ఈ విషయం పై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.
అల్లు అర్జున్ సినిమా తాజాగా విడుదలైన పుష్ప సినిమాకు నిర్మాత ముత్తంశెట్టి మీడియా అని అందరికీ తెలుసు. అయితే ఈ బ్యానర్ క్రియేట్ చేసింది అల్లు అర్జున్ మేనమామలు. మొత్తంశెట్టి మీడియా ‘పుష్ప’ సినిమా విజయ సంబరాన్ని మీడియాలో షేర్ చేసింది. ఈ సంధర్భంలో మొత్తంశెట్టి మీడియా బ్రదర్స్ తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. బ్రదర్స్‌లో ఒకరైన ముత్తంశెట్టి కృష్ణప్రసాద్ అల్లు అర్జున్ వ్యక్తిగత విషయాలతో పాటు , అల్లు ఫ్యామిలీ విషయాల గురించి ఆయన మీడియాలో మాట్లాడారు.
ముత్తంశెట్టి కృష్ణప్రసాద్ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇవి. మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య ప్రస్తుతం గ్యాప్ నడుస్తుంది. అందుకే ముత్తంశెట్టి బ్రదర్స్ నిర్మాతలుగా, ముత్తంశెట్టి మీడియా ప్రొడక్షన్ కంపనీ లైమ్ లైట్ లోకి వచ్చారంటూ టాలీవుడ్ లో వినిపించిన టాక్‌లో నిజమెంత? అంటూ మీడియా పీపుల్స్ వేసిన ప్రశ్నలకు కృష్ణప్రసాద్ వెంటనే సూటిగా రియాక్ట్ అయ్యారు. మీరు విన్న వార్తలు నూటికి నూరు శాతం అబద్దమని గట్టిగా చెప్పారు.
మేనమామలకు గుర్తింపు రావాలనే అల్లు అర్జున్ ఇలా మమ్మల్ని ప్రొడ్యూసర్ గా ఇంట్రొడ్యూస్ చేశారు. బయట జనం మాట్లాడుకున్నట్టు మాత్రం కాదని కృష్ణప్రసాద్ అన్నారు. మన దేశంలో పబ్లిక్‌కి ఏదైనా మాట్లాడుకునే స్వతంత్రం, స్వేచ్ఛ ఉంది కాబట్టి అలా మాట్లాడారని చెప్పారు. అయితే మేనమామలతో ఒక మంచి సినిమా చేయాలనే ఆలోచన అల్లు అర్జున్ కి ఎప్పటినుంచో ఉండే ఆలోచన కాబట్టే ఈ పుష్ప సినిమాలో భాగం చేశారని ఈ విషయం పై ముత్తంశెట్టి మీడియా కృష్ణప్రసాద్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.