Niharika Konidela: నిహారిక ప్రస్తుతం తన పెళ్లై ఏడాది అవబోతోన్న సందర్భంగా భర్త చైతన్యతో కలిసి వెకేషన్ ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. మొత్తానికి నిహారిక తన భర్తతో కలిసి స్పెయిన్, బార్సిలోనాలో దుమ్ములేపుతుంది.
మొత్తానికి నిహారిక చాలా రోజుల తరువాత నిర్మాతగా ఓ సక్సెస్ వచ్చింది. ఓసీఎఫ్ఎస్ అనే వెబ్ సిరీస్ లో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ మీద చిరంజీవి సైతం స్పందించాడు. ఈ చిన్న ఫ్యామిలీ స్టోర్ పెద్ద హిట్ అయింది. అయితే ప్రస్తుతం నిహారిక మాత్రం తన భర్తతో కలిసి బార్సిలోనాలో వెకేషన్లో ఉంది. గత ఏడాది డిసెంబర్ 9న నిహారిక పెళ్లి జరిగిన సంగతి మన అందరికీ తెలిసిందే. అలా ఈ మొదటి యానివర్సరీ స్పెషల్‌గా ట్రిప్‌ను ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.
చైతన్య స్కై డైవింగ్ చేస్తాడు, నేను మాత్రం ఎంకరేజ్ చేస్తాను.. కాదు నిహారిక ముందు చేస్తుంది ఆ తరువాత నేను చేస్తాను అంటూ చైతన్య కౌంటర్ వేస్తాడు. లేదు నాకు అస్సలు భయం అంటూ నిహారిక చెప్పేసింది. అయితే నిహారిక స్కై డైవింగ్ చేసిందా? లేదా? అన్నది మాత్రం తెలియడం లేదు.
ఇక నిహారిక మాత్రం ఎప్పుడూ ఫోన్లోనే బిజీగా ఉంటుందని ఫోటోలతో బుక్ చేసిన చైతన్య, మొత్తానికి వరుసగా రెండు ఫోటోలను షేర్ చేశాడు. మళ్లీ కాసేపు అయ్యాక నిహారిక మరో ఫోటోను కూడా షేర్ చేశాడు. అందులో కూడా నిహారిక ఎప్పుడు ఫోన్‌తోనే బిజీగా ఉందని చైతన్య చూపించాడు. మొత్తానికి నిహారిక చైతన్య జంట మాత్రం స్పెయిన్, బార్సిలోనాలో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.