మెగాస్టార్ చిరంజీవి గారికి కరోన టెస్ట్ పాజిటివ్ వచ్చింది. తాజాగా నటిస్తున్నా `ఆచార్య` సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్న సందర్భంగా చేయించుకున్న కోవిడ్ టెస్ట్‌లో పాజిటివ్ అని తేలిసింది. ఈ విషయాన్ని చిరంజీవి తన ట్విటర్ ద్వార ప్రకటించారు. గత 4-5 రోజుల్లో తనను కలిసినవారందరూ కోవిడ్ టెస్ట్ వెంటనే చేయించుకోవాలని కోరారు.
ఆచార్య` షూటింగ్ వెళ్లడానికి కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్ వచ్చింది. కాని నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు కనిపించ లేదు. నేను వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరు వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను అన్నారు. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని ట్వీట్టర్ లో మీకు అఫ్డేట్ చేస్తానని మెగా స్టార్ ట్వీట్ చేశారు. మెగా స్టార్ చిరంజీవి త్వరగా కోలుకోవాలని మెగా అభిమానులు ప్రార్ధస్తున్నారు.