ఆర్టికల్ 370 వల్ల రాజ్యాంగం ప్రకారం ఇతర రాష్ట్రాలకు వర్తించే నిబంధనలు జమ్మూ కశ్మీర్‌కు వర్తించవు. దీనిపై ముందుగానే అన్ని సిద్ధం చేసుకున్న మోదీ ప్రభుత్వం రాష్ట్రపతి గెజిట్ విడుదల చేసింది. దీని ప్రకారమే 1965 వరకూ ఆ రాష్ట్రానికి సీఎం బదులు ప్రధాని, గవర్నర్ స్థానంలో రాష్ట్రపతి ఉండేవారు. తాజాగా ఆర్టికల్‌ను రద్దుచేయడంతో ప్రత్యేక అధికారాలు హక్కులు కశ్మీరీలు కోల్పోనున్నారు. పార్లమెంటులో చేసిన ప్రతిచట్టం కశ్మీరీలకు వర్తిస్తుంది. ఈ ఆర్టికల్‌ను జమ్మూ కశ్మీర్ సంస్థానాధీశుడు రాజా హరి సింగ్ వద్ద దివాన్‌గా పని చేసిన గోపాలస్వామి అయ్యంగార్ రూపొందించారు. అయితే, గతంలో ఆర్టికల్ 370 పట్ల రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ ద్వారానే ఈ బిల్లు రద్దు జరుగుతుందని అమిత్ షా పేర్కొన్నారు. దీంతోపాటు కశ్మీర్లో నియోజకవర్గాల పునర్వవస్థీకరణ బిల్లు కూడా రాజ్యసభ ముందుకు వచ్చింది. తక్షణమే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జమ్ముకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తూ ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర నిర్ణయంపై పీడీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆర్టికల్ 370 రద్దుకు మోదీ ప్రభుత్వానికి బీఎస్పీ మద్దతు తెలిపింది. పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 7న జాతినిద్దేశించి ప్రసగించనున్నారు. విపక్షాల ఆందోళనపై హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. జమ్మూ కశ్మీర్‌కు మూడు కుటుంబాలు దోచుకున్నాయని ఆయన ధ్వజమెత్తారు. అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదని అమిత్ షా మండిపడ్డారు. కేంద్రం నిర్ణయంతో జమ్మూ కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం కానుందని షా స్పష్టం చేశారు.