రజినీకాంత్ పార్టీ పేరు ఫిక్స్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు పార్టీకి సంబంధించిన గుర్తు కూడా కాన్ఫర్మ్ చేసినట్టు సమాచారం వస్తుంది.
‘మక్కల్ సేవై కర్చీ’(ప్రజాసేవ పార్టీ) అనే పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. పార్టీ గుర్తుగా ఆటోను కేంద్ర ఎన్నికల కమిషన్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తాను డిసెంబర్ 31న కొత్త రాజకీయ పార్టీ ప్రారంబించబోతున్నట్టు రజినీకాంత్ కొద్దిరోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఆ పార్టీకి చీఫ్ కో-ఆర్డినేటర్‌గా అర్జున మూర్తిని, సూపర్ వైజర్‌గా తమిళ్రూవి మణియన్‌ను నియమించినట్లు వీరిద్దరూ దొరకటం నా అదృష్టమని అధికారికంగా రజినీకాంత్ ప్రకటన విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రకటనతో తమిళనాడు రాజకీయం చర్చనీయాంశంగా మారింది.
Also Read: విడుదలకు ముందే సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ‘వకీల్ సాబ్’
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రజినీ పార్టీ 234 నియోజకవర్గాల్లో పోటీచేసే అవకాశముంది. తన పార్టీకి గుర్తుగా ‘బాబా’ లోగోను ఇవ్వాల్సిందిగా రజినీకాంత్ ఎన్నికల కమిషన్ని కోరగా. ‘బాబా’ లోగోని ఎన్నికల కమిషన్ నిరాకరించింది. చివరికి ఆటో గుర్తును కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసిందట. డిసెంబర్ 31 రజినీకాంత్ తన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించన విషయం అందరికీ తెలిసిందే.