భారీ సినిమాలకు పేరుపొందిన దర్శకుడు రాజమౌళి ఎప్పడూ వివాదాలకు దూరంగా ఉండేవారు. ఇప్పుడు RRR సినిమా వివాదం రోజు రోజుకి పెరిగిపోతుంది.
ఇటీవలే ఎన్టీఆర్ భీమ్ టీజర్ విడుదల చేశారు. అందులోని కొన్ని సన్నీవేశాలపై ఓ వర్గం నుంచి వ్యతిరేకత మొదలవ్వడంతో షూటింగ్ దశలోనే సినిమాపై వివాదాలు పెరగడంతో టాలీవుడ్లో RRR పై హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై రాజమౌళి స్పందించాల్సిన అవసరం ఉందనే టాక్ పలు వర్గాల్లో నడుస్తోంది. RRR నుంచి ఇటీవల విడుదలైన ‘రామరాజు ఫర్ భీమ్‘ టీజర్‌కు ఊహించని రీతిలో రెస్పాన్స్ రావడమే గాక, వివాదాలు కూడా ఊహించని రీతిలో నడుస్తున్నాయి. కొమురం భీమ్ పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్. టీజర్ చివరలో ముస్లిం టోపీని పెట్టుకుని కనిపించడమే ఈ వివాదాలకు బీజం వేసింది. గిరిజన పుత్రుడైన కొమురం భీమ్‌కి టోపీ పెట్టడమేంటని ఇప్పటికే బీజేపీ నాయకులు రాజమౌళిపై విరుచుకుపడ్డారు.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ మరింత ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం హాట్ టాపిక్‌గా మారింది. కొమరం భీమ్‌కు టోపి పెట్టడం ఏంటి. దుమ్ముంటే నీజాం రజాకార్లకు బొట్టు పెట్టి సినిమా తియ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్.
RRR విడుదలకు అడ్డుకుంటామని, సినిమా రీళ్లను తగలబెడుతామని అన్నారు. సినిమా విడుదల చేస్తే మీ ఆస్తులను ధ్వంసం చేస్తారని హెచ్చరించారు. హిందూమతాన్ని అవమానపరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇంత జరుగుతున్నా రాజమౌళి స్పందించకపోవడం అభిమానులను కలవరపెడుతోంది. రాజమౌళి ఈ వివాదాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారనేది వేచి చూడాలి మరి!